POK: శారదా పీఠాన్ని ఆక్రమించిన పాక్ సైన్యం.. దుశ్చర్యను నిలువరించాలంటూ పీఎంవోకు శారదా కమిటీ లేఖ కశ్మీరీ పండిట్లు అత్యంత పవిత్రంగా భావించే శారదా పీఠాన్ని పాక్ సైన్యం స్వాధీనం చేసుకుంది. ఆ ప్రాంతంలో కాఫీ హోం నిర్మించాలని పాకిస్థాన్ సైన్యం భావిస్తోంది. ఈ పీఠం ముజఫరాబాద్ నుంచి 140 కి.మీ., కుప్వారా నుంచి 30 కి.మీ. దూరంలో ఉంది. By Naren Kumar 06 Dec 2023 in నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి POK: పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని సరస్వతీ దేవి పురాతన ఆలయం శారదా పీఠం పాక్ సైన్యం ఆధీనంలోకి వెళ్లింది. నియంత్రణ రేఖ సమీపంలో నీలం నది ఒడ్డున ఉన్న ఈ ఆలయం స్థానంలో కాఫీ హోం నిర్మించాలని పాకిస్థాన్ సైన్యం భావిస్తోంది. కశ్మీరీ పండిట్లు, భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో కొలిచే, ఎంతో పవిత్రంగా భావించే ఈ పీఠం ముజఫరాబాద్ నుంచి 140 కి.మీ., కుప్వారా నుంచి 30 కి.మీ. దూరంలో ఉంది. ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ జోక్యం చేసుకోవాలని శారదా కమిటీ వ్యవస్థాపకుడు రవీంద్ర పండిట్ కోరారు. ఈ అంశమై ఈ నెల 1న పీఎంవోకు లేఖ అందింది. ఇది కూడా చదవండి: J&K: విహార యాత్రలో విషాదం.. కారు లోయలో పడి… పాక్ సైన్యం దుశ్చర్యపై జమ్మూ కశ్మీర్‌లోని భక్తులు తీవ్ర అసంతృప్తి, ఆందోళన వ్యక్తపరుస్తున్నారు. శారదా పీఠం కాంప్లెక్స్‌లోని చాలా కెనాల్స్ రూపురేఖలు ఇప్పటికే మారిపోగా, పాక్ సైన్యం చొరబాటుకు ప్రయత్నిస్తోంది. గతంలో ప్రకృతి వైపరీత్యాలు, మతపరమైన దాడులు, విదేశీ దండయాత్రల ఫలితంగా శారదా శక్తి పీఠం శిథిలమవుతూ వచ్చింది. తాజాగా పాక్ దుందుడుకు చర్యలను అడ్డుకోవాలంటూ దారా షికో ఫౌండేషన్ ఇటీవల యునెస్కోకు కూడా లేఖ రాసింది. #jammu-kashmir-news #pok #sharada-peetham మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి