PM Modi: ప్రధాని మోదీ పర్యటనలో సెక్యూరిటీ లోపం.. ఎస్పీపై వేటు..

రెండేళ్లక్రితం ప్రధానిమోదీ పంజాబ్‌లో పర్యటించినప్పుడు భద్రతా వైఫల్యం ఏర్పడిన సంగతి తెలిసిందే. అయితే ఆ సమయంలో ఫిరోజ్‌పుర్‌లో ఎస్పీగా ఉన్న గుర్బిందర్‌ సింగ్‌పై 23 నెలల తర్వాత వేటు పడింది. ఆయనను తక్షణమే విధుల్లో నుంచి సస్పెండ్‌ చేస్తూ పంజాబ్‌ హోంశాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.

New Update
PM Modi: ప్రధాని మోదీ పర్యటనలో సెక్యూరిటీ లోపం.. ఎస్పీపై వేటు..

రెండేళ్ల క్రితం ప్రధాని మోదీ పంజాబ్‌లో పర్యటించినప్పుడు భద్రతా వైఫల్యం దేశవ్యాప్తంగా దుమారం రేపిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటన జరిగిన 23 నెలల తర్వాత బఠిండా జిల్లా ఎస్పీ గుర్బీందర్‌ సింగ్‌పై వేటు పడింది. ఆయనను తక్షణమే విధుల్లో నుంచి సస్పెండ్‌ చేస్తూ పంజాబ్‌ హోంశాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ ఘటనకు సంబంధించి ఇటీవల రాష్ట్ర డీజీపీ.. హోంశాఖకు నివేదిక సమర్పించారు. ప్రధాని పంజాబ్‌కు వచ్చిన సమయంలో ఫిరోజ్‌పుర్‌లో విధులు నిర్వహిస్తున్న ఎస్పీ గుర్బీందర్ సింగ్ నిర్లక్ష్యంగా ప్రవర్తించాడని.. తమ దర్యాప్తులో డీజీపీ పేర్కొన్నారు. అయితే ఈ నివేదికను పరిశీలించిన తర్వాత ఎట్టకేలకు అతడ్ని సస్పెండ్ చేస్తున్నట్లు హోంశాఖ ప్రకటించింది.

Also read: రాజస్థాన్ లో ముగిసిన ఎన్నికలు.. పోలింగ్ శాతం ఎంతంటే?

2022లో జనవరి 5న ప్రధాని మోదీ పంజాబ్‌లో నిర్వహించనున్న వివిధ కార్యక్రమంలో పాల్గొనేందుకు బఠిండా ఎయిర్‌పోర్టులో దిగారు. ఆ తర్వాత అక్కడి నుంచి ఆయన హెలికాప్టర్‌లో ఫిరోజ్‌పుర్‌వైపు వెళ్లాల్సి ఉంది. కానీ వాతావరణం అనుకూలించకపోవడంతో.. ప్రధాని రోడ్డు మార్గంలో బయలుదేరారు. మరో 30 నిమిషాల్లో గమ్యస్థానం సమీపిస్తుండగా.. మోదీ కాన్వాయ్‌ బ్రిడ్జి పైకి వచ్చింది. అయితే ఆ సమయంలో రైతు చట్టాలపై వ్యతికంగా ఉన్న వందలాది మంది రైతులు ఆ మార్గాన్ని అడ్డుకున్నారు. దీంతో ప్రధాని కాన్వయ్ 20 నిమిషాల పాటు ఆ బ్రిడ్జిపైనే ఆగిపోయింది. ఇక చివరికి ప్రధాని మోదీ వెనుదిరిగారు. పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు జరిగిన ఈ ఘటన రాజకీయంగా సంచలనం రేపింది. అయితే గతేడాది జనవరి 12న ఈ ఘటనపై సుప్రీంకోర్టు స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేసింది. అయితే దీనిపై విచారణ జరిపిన ఈ కమిటీ.. పోలీసుల విధి నిర్వహణలో లోపాలున్నట్లు సుప్రీంకోర్టు నివేదిక సమర్పించారు.

Also read: ఆర్టికల్‌ 370 రద్దుని కాంగ్రెస్ అడ్డుకుంది.. అమిత్ షా సంచలన వ్యాఖ్యలు

Advertisment
తాజా కథనాలు