డ్రెస్సింగ్ రూంలో ప్రధాని మోదీ! భారత జట్టుకు నైతిక స్థైర్యం, జడేజా ఎమోషనల్ ట్వీట్ ఫైనల్ మ్యాచ్ లో ఓటమితో నిస్పృహకు లోనైన తమకు అభిమానుల మద్దతు ధైర్యాన్నిస్తోందన్నాడు రవీంద్ర జడేజా. ఓటమి అనంతరం నిన్న రాత్రి డ్రెస్సింగ్ రూంకు ప్రధాని నరేంద్ర మోదీ రాక తమకెంతో ప్రత్యేకమైనదని, అది తమలో ధైర్యం నింపిందని ఎమోషనల్ గా ట్వీట్ చేశాడు. By Naren Kumar 20 Nov 2023 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Narendra Modi: ఓటమి దిగులుతో ఉన్న భారత క్రికెట్ జట్టుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్వయంగా డ్రెస్సింగ్ రూంకు వెళ్లి ధైర్యం నింపారు. ఫైనల్ లో పరాజయంతో తీవ్ర నిరాశలో ఉన్న ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం నింపే ప్రయత్నం చేశారు. ఈ ఓటమి భారత క్రికెట్ జట్టు సామర్థ్యాన్ని ఏమాత్రం తక్కువ చేయబోదని, తామేంటో ఇప్పటికే నిరూపించుకున్నారని స్పష్టంచేసిన ప్రధాని దేశ ప్రజలు ఇప్పుడూ, ఎప్పుడూ మీతోనే ఉంటారంటూ భరోసా ఇచ్చారు. ప్రధాని మోదీ డ్రెస్సింగ్ రూంను సందర్శించిన ఫొటోతో రవీంద్ర జడేజా భావోద్వేగ స్వరంతో ట్వీట్ చేశాడు. ‘‘టోర్నమెంట్ గొప్ప అనుభవం. నిన్నటి ఓటమితో మా గుండె పగిలింది. అయితే, అభిమానుల మద్దతు మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నది. డ్రెస్సింగ్ రూంలో నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సందర్శన ఎంతో ప్రత్యేకమైనది, అది మాలో స్ఫూర్తిని నింపింది’’ అని ట్వీట్ లో జడేజా పేర్కొన్నాడు. ఇది కూడా చదవండి: కల చెదిరింది.. గుండె పగిలింది.. నిశ్శబ్ధమే మిగిలింది! మరోవైపు పరాజయ భారంతో మైదానాన్ని వీడినా; టోర్నీలో ఆది నుంచి అత్యద్భుతమైన ఆటతీరును కనబరిచిన భారత జట్టుకు దేశవ్యాప్తంగా మద్దతు లభిస్తోంది. చివరి వరకూ పోరాట పటిమను ప్రదర్శించిన భారత జట్టుకు అభిమానులు బాసటగా నిలుస్తున్నారు. ధైర్యంగా ఉండాలంటూ సోషల్ మీడియా వేదికగా భారీగా పోస్టులు పెడుతున్నారు. ప్రధాని నరేంద్రమోదీ, హోం మంత్రి అమిత్ షా, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సహా ప్రముఖులంతా టీమిండియా స్ఫూర్తిని ప్రశంసిస్తూ ఇప్పటికే ట్వీట్లు చేశారు. ఇప్పుడూ, ఎప్పుడూ మీతోనే ఉంటామంటూ జట్టులో ధైర్యం నింపారు. We had a great tournament but we ended up short yesterday. We are all heartbroken but the support of our people is keeping us going. PM @narendramodi’s visit to the dressing room yesterday was special and very motivating. pic.twitter.com/q0la2X5wfU — Ravindrasinh jadeja (@imjadeja) November 20, 2023 #pm-narendra-modi #ravindra-jadeja #latest-telugu-news మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి