IND VS AUS: నరాలనెవరో గట్టిగా లాగేస్తున్నట్టు, గుండెనెవరో గట్టిగా మెలిపెడుతున్నట్టు… తుది సమరంలో అడుగు దూరంలో తడబడిన భారత జట్టు పరాభవం ప్రతి అభిమానికీ ఇదే అనుభవాన్ని మిగిల్చింది. వరుస విజయాలతో గర్జించిన బ్లూ టైగర్స్‌ను చివరికి కంగారూలు కట్టడి చేసిన ఆ క్షణం.. పాట్ కమిన్స్ ముందుగా చెప్పినట్టే అహ్మదాబాద్ స్టేడియాన్ని నిశ్శబ్ధం ఆవరించింది. లక్షా ముప్పై వేల గుండెలు పగిలిన చప్పుడే వినిపించింది. స్థానబలాన్ని గెలిచిన ఆస్ట్రేలియా ఆరోసారి క్రికెట్ కిరీటాన్ని వశపరచుకుంది. ఫైనల్లో తనను ఓడించడం ఎంతటి దుస్సాధ్యమో ఈ విజయంతో మరోసారి ప్రకటించింది. నాలుగేళ్ల ఎదురుచూపుల భారంతో రెండో స్థానంతోనే భారత్ సరిపెట్టుకుంది.
పూర్తిగా చదవండి..IND VS AUS: కల చెదిరింది.. గుండె పగిలింది.. నిశ్శబ్ధమే మిగిలింది!
గుండెనెవరో గట్టిగా మెలిపెడుతున్న బాధ భారత క్రికెట్ అభిమానిది. ప్రపంచకప్ కు అడుగు దూరంలో భారత జట్టు తడబడిన వేళ.. పాట్ కమిన్స్ ముందుగా చెప్పినట్టే - అహ్మదాబాద్ స్టేడియాన్ని నిశ్శబ్ధం ఆవరించింది. లక్షా ముప్పై వేల గుండెలు పగిలిన చప్పుడే వినిపించింది.

Translate this News: