PM Modi vs CM KCR: ఎన్డీఏలోకి వస్తానంటే వద్దన్నా.. కేటీఆర్ ను ఆశీర్వదించమంటే నో చెప్పా.. కేసీఆర్ టాప్ సీక్రెట్స్ రివీల్ చేసిన మోదీ

ఇందూరు వేదికగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ప్రధాని నరేంద్ర మోదీ సంచలన కామెంట్స్ చేశారు. కేసీఆర్ అవినీతి భాగోతాన్ని బయటపెట్టానని అన్నారు. కర్నాటక ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ నేతలు కాంగ్రెస్‌కు ఫండింగ్ చేశారని ఆరోపించారు. అదే తరహాలో ఇప్పుడు తెలంగాణలోనూ నోట్లు పంచేందుకు సిద్ధమయ్యారని ఆరోపించారు ప్రధాని మోదీ. అంతేకాదు.. ఎన్డీయేలో చేరుతానంటూ కేసీఆర్ తమ వద్దకు వచ్చారని ప్రధాని మోదీ వెల్లడించారు.

CM KCR: మోదీ నన్ను బెదిరించారు.. సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
New Update

PM Narendra Modi Nizamabad Meeting: ఇందూరు వేదికగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ప్రధాని నరేంద్ర మోదీ సంచలన కామెంట్స్ చేశారు. కేసీఆర్ అవినీతి భాగోతాన్ని బయటపెట్టానని అన్నారు. కర్నాటక ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ నేతలు కాంగ్రెస్‌కు ఫండింగ్ చేశారని ఆరోపించారు. అదే తరహాలో ఇప్పుడు తెలంగాణలోనూ నోట్లు పంచేందుకు సిద్ధమయ్యారని ఆరోపించారు ప్రధాని మోదీ. అంతేకాదు.. ఎన్డీయేలో చేరుతానంటూ కేసీఆర్ తమ వద్దకు వచ్చారని ప్రధాని మోదీ వెల్లడించారు. అయితే, అందుకు తాను తిరస్కరించినట్లు తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బీఆర్‌ఎస్‌తో కలిసే ప్రసక్తే లేదని తాము చెప్పామని అన్నారు.

మోదీ ఏమన్నారంటే..

'కేసీఆర్ తన వద్దకు వచ్చి తాను కూడా ఎన్డీయేలో కలుస్తానని చెప్పారు. తన బాధ్యతలను కేటీఆర్‌కు అప్పగిస్తానని చెప్పారు. కానీ, నేను అందుకు అంగీకరించలేదు. మీరు ఏమైనా రాజులా? యువరాజును సీఎం చేయడానికి అని అడిగాను. కేసీఆర్ అవినీతి బాగోతాన్ని మొత్తం చెప్పాను. ఆ తరువాత నుంచి నన్ను కలవడం మానేశారు. ' అని సంచలన కామెంట్స్ చేశారు.

'తెలంగాణ ప్రజలు నాపై ఐదేళ్లపాటు నమ్మకం ఉంచాలి. బీజేపీ సర్కార్ వచ్చిన తరువాత బీఆర్‌ఎస్ అవినీతినంతా తవ్వితీస్తాం అని ప్రధాని మోదీ అన్నారు. నా కళ్లల్లోకి చూసే ధైర్యం కేసీఆర్‌కు లేదు. కాంగ్రెస్‌తో బీఆర్ఎస్ చీకటి ఒప్పందం చేసుకుంది. ప్రతిపక్షంలోనైనా కూర్చుంటాం కానీ, బీఆర్‌ఎస్‌కు మద్ధతు పలికేది లేదు. సౌత్ ఇండియాను మోసం చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. మైనార్టీలను వంచించేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ప్రజల నమ్మకాన్ని కోల్పోయి. బీజేపీకి ఒక్క ఛాన్స్ ఇవ్వండి. బీఆర్ఎస్ అవినీతి చిట్టాను విప్పుతాం.' అని ప్రధాని మోదీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

నా కుటుంబ సభ్యులారా అంటూ..

అంతకు ముందు.. అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం సందర్భంగా మాట్లాడిన ప్రధాని మోదీ.. నా కుటుంబ సభ్యులారా అంటూ తెలంగాణ ప్రజలను తనవైపు ఆకర్షించే ప్రయత్నం చేశారు. నా కుటుంబ సభ్యులారా? అంటూ స్పీచ్ ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ.. 'కరెంట్ సరిగ్గా ఉంటే.. ఈజ్ ఆఫ్ డూయింగ్.. ఈజ్ ఆఫ్ లీవింగ్ బాగుంటాయి. పెద్దపల్లి జిల్లాలో ఎన్టీపీసీ ఆధ్వర్యంలో సూపర్ పవర్ థర్మల్ ప్రాజెక్టును ప్రారంభించాం. త్వరలోనే రెండవ యూనిట్ పనులను కూడా ప్రారంభిస్తాం. తొందరగా పూర్తిచేస్తాం. సెకండ్ ఫేజ్ పూర్తయితే 4 వేల మెగావాట్ల కెపాసిటీకి చేరుకుంటుంది. ఇది అత్యంత ఆధునిక ప్లాంట్. కేంద్రం ఏదైనా ప్రాజెక్ట్ ను ప్రారంభిస్తే.. చేసి చూపిస్తుంది. ఇది మా ప్రభుత్వ కల్చర్. రైల్వే ప్రాజెక్టులతో రవాణా మెరగవ్వడంతో పాటు మౌలిక సదుపాయాలు, వ్యాపార వృద్ధికి దోహదపడుతుంది. భారత ప్రభుత్వం ఎయిమ్స్ కాలేజీలను పెంచుతోంది.. డాక్టర్లను పెంచుతోంది. ఇప్పటికే బీబీనగర్ లో ఏర్పాటుచేశాం.. డాక్టర్ల సంఖ్యను పెంచాం. పేద వారికి మంచి వైద్యం అందించాలని చూస్తున్నాం. ఆయుష్మాన్ భారత్ పథకాన్ని పేదలకు అందిస్తున్నాం. పేదల కోసం 20 క్రిటికల్ కేర్ యూనిట్లకు శంకుస్థాపన చేశాం.' అని వివరించారు ప్రధాని మోదీ.

ఇవికూడా చదవండి:

తెలంగాణలో బీసీ కుల గణన.. సీఎం కేసీఆర్ కు రేవంత్ రెడ్డి లేఖ.. వివరాలివే!

వాట్ ఏ స్టైల్.. హాలీవుడ్ స్టార్లను తలదన్నేలా ధోనీ లుక్.. ఫోటోస్‌పై ఓ లుక్కేయండి..!!

#telangana-news #cm-kcr #telangana-politics #pm-narendra-modi
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి