Modi : కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ ఖేల్‌ ఖతం : మోదీ!

తెలంగాణను దోచుకున్న వాళ్లను మేం వదిలిపెట్టం. మాకు అధికారం కంటే ప్రజా సంక్షేమమే ముఖ్యమని మోదీ అన్నారు. బీజేపీకి ఎన్ని సీట్లు వస్తే నాకు అంత శక్తి పెరుగుతుందని మోదీ అన్నారు.మద్యం కుంభకోణంలో బీఆర్‌ఎస్‌ భారీగా ముడుపులు తీసుకుందని మోదీ పేర్కొన్నారు.

New Update
Modi : కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ ఖేల్‌ ఖతం : మోదీ!

PM Modi : దేశంలో సార్వత్రిక ఎన్నికల(General Elections) షెడ్యూల్‌ విడుదల నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు కూడా తమ ప్రచారాన్ని షూరు చేశాయి. ఈ నేపథ్యంలోనే ఏపీలో జనసేన-టీడీపీ-బీజేపీ(Janasena-BJP-TDP)  కలిసి ఏర్పాటు చేసిన ప్రజాగళం బహిరంగ సభకు ప్రధాని నరేంద్ర మోదీ(PM Narendra Modi) హాజరయ్యారు. ఆయన రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పర్యటిస్తున్న నేపథ్యంలో సోమవారం తెలంగాణ(Telangana) లోని జగిత్యాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన బీజేపీ విజయ సంకల్ప యాత్రలో పాల్గొంటున్నారు.

ఈ సందర్భంగా ఆయన సభకు హాజరయ్యారు. ఎన్నికల షెడ్యూలు వచ్చిన తరువాత రాష్ట్రంలో మొదటిసారి ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభ కావడంతో ప్రజలు , బీజేపీ(BJP)  కార్యకర్తలు కూడా సభ కు భారీగా తరలి వచ్చారు. జగిత్యాల సభ ద్వారా కరీంనగర్‌, నిజామాబాద్‌, పెద్దపల్లి పార్లమెంట్‌ నియోజకవర్గాలకు సంబంధించి ఎన్నికల శంఖాన్ని పూరించడానికి ప్రధాని నరేంద్ర మోదీ సిద్దమయ్యారు.

గత పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపీ తెలంగాణలో 4 స్థానాలు గెలుపొందగా.. అందులో 3 కరీంనగర్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ నియోజకవర్గాలే కావడం విశేషం. ఈ ప్రాంతంలో మరింత పట్టు బిగించేందుకు మోదీ గట్టి వ్యూహన్నే రచిస్తున్నారు. హైదరాబాద్‌ నుంచి హెలికాఫ్టర్‌ ద్వారా మోదీ జగిత్యాలకు చేరుకున్నారు.

తెలంగాణలో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో మోదీ తెలంగాణ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. దానికి తగినట్లుగానే బీజేపీ నేతలు కూడా ప్రచారాన్ని నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తుంది. ఇప్పటికే మోదీ తెలంగాణలో రెండుసార్లు పర్యటించారు.

జగిత్యాల సభ(Jagtial Sabha)  వేదిక వద్ద కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి(Kishan Reddy) మాట్లాడుతున్నారు. మోదీ పాలనలో దేశం అన్ని రంగాల్లో ముందుకు దూసుకుపోతుందని వివరించారు. మోదీ ప్రభుత్వం అంకిత భావంతో పని చేసింది.. చేస్తుంది అని చెప్పడానికి రామగుండం ఎరువుల పరిశ్రమ, జాతీయ రహదారులు , పసుపు బోర్డు , సమ్మక్క సారక్క ట్రైబల్ యూనివర్సిటీ ఇవన్నీ కూడా మోదీ ముందుచూపు వల్లే రాష్ట్రానికి వచ్చాయని కిషన్‌ రెడ్డి అన్నారు.

గత ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు దోపిడీ చేసింది. ప్రాజెక్టులు భూ కేటాయింపులు అన్ని కూడా కుటుంబానికే అంకితం చేసుకున్నారు. కేసీఆర్ కుటుంబం మద్యం కుంభకోణం చేసి యావత్తు రాష్ట్రాన్ని తలదించుకునేలా చేసింది. బీఆర్‌ఎస్‌ బాటలోనే కాంగ్రెస్‌ కూడా నడుస్తుందని కిషన్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

వీటిని అన్నిటిని కూడా ఆరికట్టాలంటే మరోసారి నరేంద్ర మోదీని ప్రధాని చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.

ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. సభను తెలుగులో ప్రారంభించారు.. నా తెలంగాణ కుటుంబ సభ్యులకు నమస్కారాలు అని మొదలు పెట్టారు. తెలంగాణ ప్రజలు కొత్త చరిత్ర సృష్టిస్తున్నారన్నారు. ఎన్నికల తరువాత తెలంగాణలో కాంగ్రెస్(Congress), బీఆర్‌ఎస్‌(BRS) ఖేల్‌ ఖాతం అన్నారు.

తెలంగాణలో బీజేపీ క్రమంగా బలపడుతోందన్నారు. ఇప్పటికే మాల్కాజ్‌గిరిలో ప్రజలు బీజేపీకి బ్రహ్మరథం పట్టారు. దేశంలో మరోసారి బీజేపీ ప్రభుత్వం రావడం ఖాయమని మోదీ అన్నారు. భారత్‌ అభివృద్ది చెందితే తెలంగాణ కూడా అభివృద్ది చెందుతుందని వివరించారు.''నేను టెక్నాలజీ వినియోగించి మీతో తెలుగులో మాట్లాడుతాను. ట్విట్టర్(ఎక్స్) వేదికగా ‘నమో ఇన్ తెలుగు’ డౌన్ లోడ్ చేసుకోండి. వందకు వంద శాతం కాకపోయినా.. 80 నుంచి 90 శాతం వరకు ఇది సక్సెస్ అవుతుంది.

అందులో ఏమైనా తప్పులు ఉంటే నాకు చెప్పండి. మీరు నా టీచర్లు.. నాకు తెలుగు నేర్పిస్తారు కదా..ఎవరైనా ఏమైనా అంటే.. గడ్ బడ్.. చేయకు.. మోడీ నా జేబులో ఉన్నాడని చెప్పండి. తెలంగాణలోని ప్రతి మొబైల్ లో మోడీ ఉండాలి. మీ మొబైల్ ఫ్లాష్ లైట్లు ఆన్ చేసి నాకు అండగా ఉంటానని గ్యారెంటీ ఇవ్వండి'' అంటూ మోదీ మాట్లాడారు.

తెలంగాణను దోచుకున్న వాళ్లను మేం వదిలిపెట్టం. మాకు అధికారం కంటే ప్రజా సంక్షేమమే ముఖ్యమని మోదీ అన్నారు. బీజేపీకి ఎన్ని సీట్లు వస్తే నాకు అంత శక్తి పెరుగుతుందని మోదీ అన్నారు. మద్యం కుంభకోణంలో బీఆర్‌ఎస్‌ భారీగా ముడుపులు తీసుకుందని మోదీ పేర్కొన్నారు. కాళేశ్వరంలో బీఆర్‌ఎస్‌ అవినీతికి పాల్పడింది.

తెలంగాణ నుంచి డబ్బులు ఢిల్లీలో కుటుంబ పార్టీ పెద్దలకు చేరవేస్తున్నారు. దేశంలో జరిగిన స్కామ్‌ లన్నింటికీ కుటుంబ పార్టీలే కారణమని మోదీ ఆరోపించారు. రాహుల్‌ గాంధీ తన పోరాటం శక్తికి వ్యతిరేకమన్నారు. శక్తిని నాశనం చేసేవాళ్లకు...శక్తికి పూజ చేసేవాళ్లకు మధ్య పోరాటం జరుగుతుందని మోదీ వివరించారు. నాకు ప్రతీ మహిళా..ఒక శక్తి స్వరూపంలా కనిపిస్తోందని మోదీ పేర్కొన్నారు.

శక్తి ని నాశనం చేస్తామంటున్న రాహుల్‌ ఛాలెంజ్‌ ను నేను స్వీకరిస్తున్నట్లు మోదీ పేర్కొన్నారు. చంద్రయాన్‌ విజయవంతమైన ప్రాంతానికి కూడా శివశక్తి అని పేరు పెట్టాను. శక్తి ఆశీర్వాదం ఎవరికీ ఉందో ..ఉంటుందో జూన్ నాలుగున తెలుస్తుందని మోదీ అన్నారు. నేను భారత మాతకు పూజారిని అని మోదీ అన్నారు.

Also Read : ఈ 10 ఫుడ్స్‌ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనవి.. బీపీ, షుగర్…పరార్!

Advertisment
Advertisment
తాజా కథనాలు