Ind vs Pak ODI Match: టీమిండియాను అభినందించిన ప్రధాని నరేంద్ర మోదీ..

ఐసీసీ క్రికెట్ వన్డే వరల్డ్ కప్‌ 2023 ట్రోఫీలో భాగంగా శనివారం పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా గెలుపొందడంపై ప్రధాని నరేంద్ర మోదీ సంతోషం వ్యక్తం చేశారు. టీమిండియా ప్లేయర్లను అభినందించారు. ఇదే అంశంపై ఒక ప్రకటన విడుదల చేసిన ఆయన.. ఈ చారిత్రాత్మక విజయం సాధించిన టీమ్ ఇండియాకు అభినందనలు తెలియజేస్తున్నాను అని అన్నారు.

New Update
PM MODI: జాకీర్ హుస్సేన్, శంకర్ మహదేవన్‌లను అభినందించిన ప్రధాని మోదీ..దేశం గర్విస్తోందంటూ.!

India vs Pakistan Match: ఐసీసీ క్రికెట్ వన్డే వరల్డ్ కప్‌ 2023 ట్రోఫీలో భాగంగా శనివారం పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా గెలుపొందడంపై ప్రధాని నరేంద్ర మోదీ సంతోషం వ్యక్తం చేశారు. టీమిండియా ప్లేయర్లను అభినందించారు. ఇదే అంశంపై ఒక ప్రకటన విడుదల చేసిన ఆయన.. ఈ చారిత్రాత్మక విజయం సాధించిన టీమ్ ఇండియాకు అభినందనలు తెలియజేస్తున్నాను అని అన్నారు. గుజరాత్‌లోని అహ్మబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా భారత్-పాకిస్తాన్ మధ్య వన్డే మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో వన్డే ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌పై టీమిండియా ఘన విజయం సాధించింది. మెగా ఈవెంట్‌లో చిరకాల ప్రత్యర్థి పాక్‌పై భారత్‌కు ఇది రికార్డ్ స్థాయిలో 8వ విజయం.

ఇదికూడా చదవండి: భారత్-పాక్ మ్యాచ్ క్రేజ్…ఆసుపత్రులలో బెడ్స్ బుకింగ్

నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా భారత్-పాకిస్తాన్ మధ్య జరిగిన వన్డే మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. దాంతో బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్.. 191 పరుగులకే ఆలౌట్ అయ్యింది. భారత బౌలర్ల ధాటికి పాక్ బ్యాట్స్‌మెన్ వరుసంగా వికెట్లు సమర్పించుకున్నారు. దాంతో నిర్ణీత ఓవర్లు పూర్తవకుండానే.. ఆలౌట్ అయ్యింది పాక్ టీమ్. పాక్ టీమ్‌లో బాబర్ అజామ్(50), మహ్మద్ రిజ్వాన్(49) మెరుగైన పరుగులు చేశారు. వీరిద్దరు మినహా మిగతా వారంతా ఫెయిల్‌ అయ్యారు. ఇక 192 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా బ్యాట్స్‌మెన్.. తొలి నుంచే పాక్ బౌలర్లకు చుక్కలు చూపించారు. ఓపెనర్, కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కలిసి జట్టు స్కోరును భారీగా పెంచేశారు. చివరకు 3 వికెట్లు కోల్పోయిన టీమిండియా.. 30 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించింది. రోహిత్ శర్మ 86(63) పరుగులు చేయగా.. శుభ్‌మన్‌గిల్ 16(11), శ్రేయాస్ అయ్యర్ 53(62)*, కేఎల్ రాహుల్ 19(29)* పరుగులతో రాణించారు.

ఇదికూడా చదవండి: Renu Desai: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కుమారుడి తెరంగేట్రంపై రేణు దేశాయ్ ఎమన్నారంటే..?

Advertisment
Advertisment
తాజా కథనాలు