రెండేండ్ల తర్వాత ఢిల్లీకి మోడీ ‘రాఖీ సిస్టర్’.. ఈ సారి స్పెషల్ రాఖీ తయారు చేసిన పాకిస్తాన్ మహిళ....!

ప్రధాని మోడీకి రాఖీ సిస్టర్‌గా పిలవబడే పాకిస్థాన్ మహిళ కమర్ మొహిసిన్ షేక్ ఈ ఏడాది కూడా మోడీకి రాఖీ కట్టనున్నారు. ప్రధాని మోడీ కోసం తాను ఈ సారి ప్రత్యేకంగా రాఖీను తయారు చేసినట్టు ఆమె వెల్లడించారు. గత 30 ఏండ్లుగా ప్రధాని మోడీకి ఆమె రాఖీ కడుతున్నారు. ఈ సారి కూడా ఢిల్లీకి వచ్చి ప్రధాని మోడీకి రాఖీ కట్టేందుకు ఆమె రెడీ అవుతున్నారు.

author-image
By G Ramu
రెండేండ్ల తర్వాత ఢిల్లీకి మోడీ ‘రాఖీ సిస్టర్’.. ఈ సారి స్పెషల్ రాఖీ తయారు చేసిన పాకిస్తాన్ మహిళ....!
New Update

PM Modi's Pakistani sister Qamar Mohsin Sheikh: ప్రధాని మోడీకి రాఖీ సిస్టర్‌గా పిలవబడే పాకిస్థాన్ మహిళ కమర్ మొహిసిన్ షేక్ ఈ ఏడాది కూడా మోడీకి రాఖీ కట్టనున్నారు. ప్రధాని మోడీ కోసం తాను ఈ సారి ప్రత్యేకంగా రాఖీను తయారు చేసినట్టు ఆమె వెల్లడించారు. గత 30 ఏండ్లుగా ప్రధాని మోడీకి ఆమె రాఖీ కడుతున్నారు. ఈ సారి కూడా ఢిల్లీకి వచ్చి ప్రధాని మోడీకి రాఖీ కట్టేందుకు ఆమె రెడీ అవుతున్నారు.

మీడియాతో ఆమె మాట్లాడుతూ.... తన సోదరుడు ప్రధాని మోడీ కోసం తాను ప్రత్యేకంగా ఓ రాఖీని తయారు చేశానన్నారు. ప్రధాని మోడీకి పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టమని ఆమె అన్నారు. అందుకే రాఖీతో పాటు వ్యవసాయానికి సంబంధించిన ఓ పుస్తకాన్ని కూడా బహుమతిగా ఇవ్వనున్నట్టు వెల్లడించారు. కరోనా నేపథ్యంలో రెండేండ్లుగా రక్షాబంధన్ రోజు మోడీని కలుసుకోలేకపోయానని వాపోయారు.

ఈ సారి మాత్రం ప్రధాని మోడీకి కలిసి రాఖీ కడతానని చెప్పారు. ప్రధాని మోడి (PM MODI) కోసం తాను ఎరుపు రంగు రాఖీని తయారు చేశానన్నారు. ఎరుపు అనేది శక్తికి గుర్తు అని పేర్కొన్నారు. అంతకు ముందు మోడీ గుజరాత్ ప్రధాని కావాలని తాను అల్లాను ప్రార్థించానన్నారు. ఆయన ప్రధాని కావాలని తాను రాఖీ కట్టిన ప్రతీసారి ఆకాంక్షను మోడీతో వెల్లడించానన్నారు.

ఆయన ఆకాంక్షలను దేవుడు నెరవేర్చాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. దేశ ప్రధానిగా ఇప్పుడు మోడీ ప్రశంసనీయమైన పని చేస్తున్నారని తెలిపారు. గతేడాది కరోనా నేపథ్యంలో ప్రధాని మోడీకి ఆమె రక్షా బంధన్ శుభాకాంక్షలు తెలిపారు. వచ్చే ఏడాది ఎలాగైనా మోడీని కలిసి రాఖీ కడతానని ఆమె అన్నారు. అన్నట్టుగానే ఆమె ఇప్పుడు న్యూఢిల్లీకి రానున్నారు.

ఇక 2024 లోక్ సభ ఎన్నికల్లో మోడీ మళ్లీ ప్రధాని అవుతారని అందులో ఎలాంటి సందేహమూ లేదన్నారు. మళ్లీ ప్రధాని అయ్యే శక్తి సామర్థ్యాలు ఆయనకు వున్నాయని చెప్పారు. ప్రతీ సారి ఆయన ప్రధాని కావాలని తాను కోరుకుంటానని చెప్పారు. ఈ సారి కూడా ప్రధాని మోడీ కోసం దేవున్ని ప్రార్థిస్తానని చెప్పారు.

Also Read: ఫేక్ న్యూస్ కు చెక్ పెట్టేందుకు సిద్దరామయ్య కీలక నిర్ణయం…. ఇకపై ఫ్యాక్ట్ చెక్ యూనిట్ ఏర్పాటు…!

#rakhi #raksha-bandhan #pm-modis-pakistani-sister-qamar-mohsin-sheikh #pm-modis-pakistani-sister #kamar-mohisin-shake #modi-rakhi-sister #pm-modi
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe