విదేశీ గడ్డపై భారత జాతీయ పతాకానికి ప్రధాని విధేయత... !

విదేశీ గడ్డపై కూడా భారత పతాకానికి ప్రధాని మోడీ విధేయత చూపారు. దక్షిణాఫ్రికాలోని జోహెన్నెస్ బర్గ్‌లో జరుగుతున్న బ్రిక్స్ సమావేశంలో జరిగిన ఓ ఘటన జాతీయ పతాకం పట్ల ప్రధాని మోడీకి వున్న గౌరవానికి అద్దం పడుతోంది. ప్రధాని మోడీ చూపిన విధేయతను చూసి అక్కడ వున్న వాళ్లు ఆయనపై ప్రశంసలు కురిపించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

author-image
By G Ramu
New Update
విదేశీ గడ్డపై భారత జాతీయ పతాకానికి ప్రధాని విధేయత... !

విదేశీ గడ్డపైన ప్రధాని మోడీ తన దేశ భక్తిని చాటుకున్నారు. దక్షిణాఫ్రికాలోని జోహెన్నెస్ బర్గ్‌లో జరుగుతున్న బ్రిక్స్ సమావేశంలో జరిగిన ఓ ఘటన జాతీయ పతాకం పట్ల ప్రధాని మోడీకి వున్న గౌరవానికి అద్దం పడుతోంది. ప్రధాని మోడీ చూపిన విధేయతను చూసి అక్కడ వున్న వాళ్లు ఆయనపై ప్రశంసలు కురిపించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

బ్రిక్స్ సమావేశాల సమయంలో ఈ రోజు ఫోటో షూట్ నిర్వహించారు. ఫోటో షూట్ కోసం దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రాంపోసాతో పాటు ప్రధాని మోడీ కూడా స్టేజి పైకి వచ్చారు. ఆ సమయంలో స్టేజిపై భారత, దక్షిణాఫ్రికాకు చెందిన పతాకాలు(పేపర్ ఫ్లాగ్)తో పాటు కింద పడి వున్నాయి.. దీంతో అది గమనించిన మోడీ వెంటనే స్టేజిపై పడి వున్న పతాకాన్ని తీసి తన జేబులో వేసుకున్నారు.

ఆ విషయం గమనించిన సిరిల్ రాం పోసా తమ దేశ జెండాను కూడా తీశారు. పక్కనే ఉన్న ఓ సహాయకురాలికి ఇచ్చారు. భారత పతాకాన్ని కూడా ఇవ్వాలని మోడీని కూడా కోరారు. కానీ దానికి ఆయన ఫర్వాలేదన్నారు. తన దగ్గరే ఉంచుకుంటానని సైగలు చేశారు. దీంతో ఆ వ్యక్తి వెళ్లిపోయారు. ఈ ఘటనను చూసి మోడీని అక్కడ వున్న వాళ్లందరూ ప్రశంసిస్తున్నారు.

అంతకు ముందు బ్రిక్స్ బిజినెస్ ఫోరం సమావేశంలో ప్రధాని మోడీ మాట్లాడారు. భారత్ లో జరుగుతున్న అభివృద్ది గురించి ఆయన ప్రసంగించారు. ప్రపంచంలో ఇప్పుడు భారత్ అత్యంత వేగంగా అభివృద్ది చెందుతన్న అతి పెద్ద దేశమన్నారు. త్వరలోనే భారత్ 5 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని ఆయన వెల్లడించారు. సమీప భవిష్యత్ లో భారత్ గ్రోత్ ఇంజన్ గా మారుతుందన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు