/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-2024-04-20T150616.578-jpg.webp)
Chandrababu : టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు 75వ జన్మదినం సందర్భంగా నెట్టింట శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సామాన్యులే కాకుండా పెద్ద ఎత్తున రాజకీయ ప్రముఖులు సైతం చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ(PM Narendra Modi) ట్విటర్(X) వేదికగా చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
"ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఏపీ సర్వతోముఖాభివృద్ధి కోసం ఎల్లప్పుడూ అంకితభావంతో కృషి చేసే అనుభవజ్ఞుడైన నాయకుడు. ప్రజాసేవలో నిమగ్నమైన ఆయన దీర్ఘాయుష్కుడై, ఆరోగ్యవంతుడై జీవించాలని ప్రార్థిస్తున్నాను" అంటూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.
ఇక తెలుగు రాష్ట్రాల్లో అయితే చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు మిన్నంటుతున్నాయి. ఎక్కడికక్కడ ఆయన అభిమానులు, పార్టీ నేతలు, కార్యకర్తలు కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహిస్తున్నారు. కొందరు సైకిల్ ర్యాలీ చేస్తుంటే మరికొందరు అన్నదానం వంటివి చేసి తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. మరోవైపు సోషల్ మీడియాలో ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ప్రపంచంలోని నలుమూలల నుంచి అభిమానులు ట్విటర్ వేదికగా చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. దీంతో HBDBABU హ్యాష్ ట్యాగ్ ట్విటర్ ట్రెండింగ్‌లో ఉంది.
Birthday wishes to former Andhra Pradesh CM Shri @ncbn Garu. An experienced leader, he has always devoted himself towards AP's all round progress. I pray that he is blessed with a long and healthy life in service of the people.
— Narendra Modi (@narendramodi) April 20, 2024
Also Read : స్నానానికి ముందు ఒక గ్లాస్ నీళ్లు తాగితే ఏమవుతుంది..?