Drinking Water: స్నానానికి ముందు ఒక గ్లాస్ నీళ్లు తాగితే ఏమవుతుంది..? ఆరోగ్యవంతమైన శరీరానికి నీళ్లు చాలా ముఖ్యం. నీళ్లు తాగడమే కాదు, సరైన సమయంలో తాగకపోవడం కూడా ఇబ్బందులను కలిగిస్తుంది. అయితే స్నానానికి ముందు గ్లాసు నీళ్లు తాగడం మంచిదని చెబుతారు నిపుణులు. అసలు ఇది సరైన అలవాటా..? కాదా..? తెలుసుకోవడానికి ఆర్టికల్ లోకి వెళ్ళండి. By Archana 20 Apr 2024 in Latest News In Telugu టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Drinking Water: ఆరోగ్యవంతమైన శరీరానికి తగిన మోతాదులో నీరు త్రాగడం చాలా ముఖ్యం. తక్కువ నీరు తాగడం ద్వారా అనేక సమస్యలను ఎదుర్కొంటారు. అయితే నీళ్లు తాగడమే కాదు, సరైన సమయంలో నీళ్లు తాగకపోవడం వల్ల కూడా ఇబ్బందులు వస్తాయని చెబుతున్నారు నిపుణులు. అప్పట్లో నానమ్మలు కాలంలో స్నానానికి ముందు ఒక గ్లాసు నీళ్లు తాగమని సలహా ఇచ్చేవారు. అయితే ఇది సరైన అలవాటా..? కాదా..? ఇప్పుడు తెలుసుకుందాము. స్నానానికి ముందు నీళ్లు తాగడం సరైనదా? కాదా? స్నానానికి ముందు ఒక గ్లాసు నీరు తాగడం వల్ల రక్తపోటు తగ్గుతుంది. ఒక గ్లాసు వేడినీరు రక్తనాళాలను విస్తరించి.. బ్లడ్ ఫ్లోనూ సక్రమంగా నిర్వహిస్తుంది. ఇది రక్తపోటు ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. స్నానం చేసిన తర్వాత నీళ్లు తాగాలా..? స్నానం చేసిన తర్వాత నీరు త్రాగడం మీ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. స్నానం చేసినప్పుడు చెమట పట్టడం వల్ల శరీరం ద్రవాన్ని కోల్పోతుంది. ఇది డీ హైడ్రేషన్ కు దారితీస్తుంది. స్నానం చేసిన తర్వాత నీరు తాగడం వల్ల డీహైడ్రేషన్‌ను సమస్యను తగ్గించవచ్చు. నీరు త్రాగడానికి సరైన మార్గం ఏమిటి ఎల్లప్పుడూ గోరువెచ్చని నీరు త్రాగడానికి ప్రయత్నించండి. కూర్చొని నీళ్లు తాగడం సరైన మార్గం. నిలబడి నీళ్లు తాగడం వల్ల శరీరంలోని ద్రవాల సమతుల్యత దెబ్బతింటుంది. అలాగే నీరు నెమ్మదిగా తాగాలి. ఆహరం తినే సమయంలో ఎక్కువగా నీళ్లను తీసుకోవడం తగ్గించండి. భోజనం పూర్తి చేశాక తాగటం మంచిది. Also Read: Ice water Facial: మొహాన్ని ఐస్ వాటర్ లో పెడుతున్నారా..? అయితే జాగ్రత్త..! #drinking-water సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి