Modi: నేడు ఓరుగల్లులో మోదీ పర్యటన..వేములవాడలో ప్రత్యేక పూజలు!

పార్లమెంట్‌ ఎన్నికల్లో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం ఓరుగల్లులో పర్యటించనున్నారు. ఈ క్రమంలోనే ఆయన విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌ లో వేములవాడకు బయల్దేరి వెళ్తారు. వేములవాడ రాజన్నకు కోడేమొక్కులు చెల్లించి స్వామి వారికి ప్రత్యేక పూజలు చేయనున్నారు.

Modi: నేడు ఓరుగల్లులో మోదీ పర్యటన..వేములవాడలో ప్రత్యేక పూజలు!
New Update

PM Modi Telangana Tour: పార్లమెంట్‌ ఎన్నికల్లో (Lok Sabha Elections 2024) భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం ఓరుగల్లులో పర్యటించనున్నారు. ఈ క్రమంలోనే ఆయన విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌ లో వేములవాడకు (Vemulawada) బయల్దేరి వెళ్తారు. వేములవాడ రాజన్నకు కోడేమొక్కులు చెల్లించి స్వామి వారికి ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఆ తరువాత కోర్టు పక్కన గల మైదానంలో బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి, కరీంనగర్‌ అభ్యర్థి బండి సంజయ్‌ కు (Bandi Sanjay) మద్దతు తెలపనున్నారు. గుడి చెరువులో హెలిప్యాడ్ ను అధికారులు ముందుగానే సిద్ధం చేశారు. 1200 మంది పోలీసులతో భారీ భద్రత ఏర్పాటు చేశారు.

ప్రత్యేక హెలికాప్టర్‌లో వేములవాడ నుంచి ఉదయం 11.05 గంటలకు బయలుదేరుతారు. ఉదయం 11.45 గంటలకు మామునూర్‌ హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. ఉదయం 11.55 గంటలకు బహిరంగ సభ వేదికపైకి చేరుకుని.. మధ్నాహ్నం 12 నుంచి 12.50 వరకు ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. మధ్నాహ్నం 12.55 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్‌లో బయలుదేరతారు. అనంతరం వరంగల్ లో (Warangal) ప్రధాని మోదీ పర్యటించనున్నారు. వరంగల్ బీజేపీ అభ్యర్థి ఆరూరి రమేష్ మద్దతుగా ప్రచారంలో పాల్గొననున్నారు. ఉదయం 10.00 గంటలకు వేములవాడ నుండి హెలికాప్టర్ లో మామునూరుకు చేరుకుంటారు.

ఆ పక్కనే ఉన్న లక్ష్మీపురం గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ప్రధాన మంత్రి మోదీ పర్యటన సందర్భంగా బీజేపీ (BJP) వర్గాలు భారీ ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా వరంగల్ జిల్లా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు.తారు.నేడు ప్రధాని మోదీ మధ్యాహ్నం 3.35 గంటలకు ప్రత్యేక విమానంలో తిరుపతి (Tirupathi) ఎయిర్‌పోర్టుకు బయలు దేరనున్నారు. తిరుపతి నుంచి హెలికాప్టర్‌లో రాజంపేట కలికిరికి వెళ్లనున్నారు. మధ్యాహ్నం 3.45 గంటలకు కలికిరిలో ప్రధాని మోడీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. సాయంత్రం 5.20 గంటలకు హెలికాప్టర్‌లో తిరుపతి ఎయిర్‌పోర్టుకు ప్రధాని మోడీ బయలు దేరనున్నారు.

అనంతరం సాయంత్రం 6.25 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. రాత్రి 7 గంటలకు రోడ్డు మార్గాన బందర్‌ రోడ్డు ఇందిరా గాంధీ స్టేడియంకు బయలు దేరనున్నారు. స్టేడియం నుంచి బెంజ్‌ సర్కిల్ వరకు గంటసేపు ప్రధాని మోదీ రోడ్‌ షో నిర్వహించనున్నారు. అనంతరం గన్నవరం నుంచి ఢిల్లీకి మోదీ బయల్దేరి వెళ్తారు.

Also read: నేడు ఏపీలో పిడుగులతో కూడిన భారీ వర్షాలు!

#warangal #lok-sabha-elections-2024 #karimnagar #pm-modi #vemulawada
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి