Revanth - Modi: 'అన్ని విధాలా తోడుగా ఉంటా..' రేవంత్‌కు మోదీ బెస్ట్‌ విషెస్!

తెలంగాణ ప్రగతికి తన సంపూర్ణ సహకారం అందిస్తానని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. తెలంగాణ సీఎంగా ప్రమాణం చేసిన రేవంత్‌రెడ్డిని అభినందిస్తూ మోదీ ట్వీట్ చేశారు.

Revanth - Modi: 'అన్ని విధాలా తోడుగా ఉంటా..' రేవంత్‌కు మోదీ బెస్ట్‌ విషెస్!
New Update

PM Modi congratulates Revanth Reddy: తెలంగాణ కొత్త సీఎం(Telangana New CM)గా రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ తమిళిసై రేవంత్ రెడ్డితో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. ముఖ్యమంత్రి అనంతరం ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చే గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించారు. హైదరాబాద్‌లోని లాల్ బహదూర్ శాస్త్రి స్టేడియంలో లక్షల మంది ప్రేక్షకుల సమక్షంలో జరిగిన కార్యక్రమంలో రేవంత్‌రెడ్డితో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సీఎంగా ప్రమాణం చేయించారు. రేవంత్‌రెడ్డి పాటు ఆయన మంత్రివర్గంలోని 11 మంది సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఇందులో ఉపముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు మల్లు భట్టి విక్రమార్క. అటు మంత్రులుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, దామోదర్ రాజనరసింహ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దాన అనసూయ(సీతక్క), తుమ్మల నాగేశ్వర్ రావు, కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు మంత్రివర్గంలో చేరారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డికి (Revanth Reddy) అభినందనల వెల్లువ కురుస్తోంది. ప్రధాని మోదీ(Modi) నుంచి సామాన్యుల వరకు ట్వీట్లు పెడతూ విషెస్‌ చెబుతున్నారు. ఈ సమయంలోనే మోదీ చేసిన ట్వీట్ ఆసక్తిని రేపుతోంది.


మోదీ ఏం అన్నారంటే?
'తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ రేవంత్ రెడ్డి గారికి అభినందనలు. రాష్ట్ర ప్రగతికి, పౌరుల సంక్షేమానికి అన్ని విధాలా తోడ్పాటు అందిస్తానని నేను హామీ ఇస్తున్నాను' అని మోదీ ట్వీట్ చేశారు. రేవంత్‌రెడ్డి ట్విట్టర్‌ ఐడీని మెన్షన్ చేసి మరీ ట్వీట్ చేయడం ఆసక్తిని రేపుతోంది. నిజానికి ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల్లో కేవలం తెలంగాణలో మాత్రమే కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ అధికారంలోకి వచ్చింది.

హాజరైన ముగ్గురు గాంధీలు:
రేవంత్‌ రెడ్డి ప్రమాణస్వీకారానికి గాంధీ కుటుంబం హాజరైంది. సోనియా గాంధీ (Sonia Gandhi), రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా వచ్చారు. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య,ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్ హాజరయ్యారు. 2014లో తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి కేసీఆర్‌ నేతృత్వంలోని భారత రాష్ట్ర సమితి తెలంగాణను పాలించింది. అయితే ఈ ఎన్నికల్లో ఓటమి పాలైంది. 119 అసెంబ్లీ స్థానాలకు గాను కాంగ్రెస్‌ 65 స్థానాలను గెలుచుకోని అధికారంలోకి వచ్చింది.

Also Read: జాత్యహంకార స్కోరు కార్డు.. క్షమాపణలు చెప్పిన క్రికెట్ ఆస్ట్రేలియా!

WATCH:

#congress #narendra-modi #revanth-reddy #telangana-elections-2023 #telangana-new-cm
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe