PM Modi: రష్యా, ఉక్రెయిన్‌తో చర్చలు.. ప్రధాని మోదీ శాంతి సందేశం

ఇటీవల రష్యా, ఉక్రెయిన్‌ దేశాల్లో ప్రధాని మోదీ జరిపిన చర్చలు.. ప్రపంచ వేదికపై భారత్‌ను ఓ కీలక ప్లేయర్‌గా నిలిపాయి.అలాగే ఇరు దేశాలతో భారత్‌కు ఉన్న చారిత్రక సంబంధాలతో పాటు.. శాంతి స్థాపకుడిగా ప్రధాని మోదీ సామర్థ్యంపై ఆశలు చిగురించాయి.

PM Modi: రష్యా, ఉక్రెయిన్‌తో చర్చలు.. ప్రధాని మోదీ శాంతి సందేశం
New Update

రెండేళ్ల క్రితం రష్యా, ఉక్రెయిన్‌ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ఇంకా చల్లారలేదు. ఇప్పటికీ ఇరుదేశాల్లో బాంబుల మోతలు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే ఇటీవల ప్రధాని మోదీ రష్యా, ఉక్రెయిన్‌ దేశాలకు పర్యటించిన సంగతి తెలిసిందే. ఇరుదేశాలతో ప్రధాని మోదీ జరిపిన చర్చలు.. ప్రపంచ వేదికపై భారత్‌ను ఓ కీలక ప్లేయర్‌గా నిలిపాయి. దాదాపు 30 ఏళ్ల తర్వాత భారత ప్రధాని ఇలా ఉక్రెయిన్ పర్యటన చేయడం.. విరుద్ధమైన ప్రపంచ శక్తుల మధ్య సున్నితమైన బ్యాలెన్స్‌ను కొనసాగించే సామర్థ్యాన్ని ప్రదర్శించింది.

Also Read: శభాష్ అమ్మాయిలు.. పారాలింపిక్స్‌లో ఒకరికి పసిడి, మరొకరికి కాంస్యం

రష్యా, ఉక్రెయిన్‌తో భారత్‌కు ఉన్న చారిత్రక సంబంధాలతో పాటు.. ఈ ఉద్రిక్త పరిస్థితుల్లో శాంతి స్థాపకుడిగా ప్రధాని మోదీ సామర్థ్యంపై ఆశలు చిగురించాయి. సోవియట్ యూనియన్ బలమైన మిత్రదేశంగా ఉన్న ప్రచ్ఛన్న యుద్ధ సమయానికే భారత్‌కు రష్యాతో మంచి సంబంధాలు ఉన్నాయి. 1971లో ఇండో - సోవియట్‌ శాంతి, స్నేహం, సహకార ఒప్పందంపై రెండు దేశాలు సంతకాలు చేశాయి. అంతేకాదు దశాబ్దాల పాటుగా రష్యా.. భారత్‌కు సైనిక పరికరాలు, సాంకేతికతను సరఫరా చేస్తూ కీలకమైన రక్షణ భాగస్వామిగా ఉంది. అలాగే సోవియట్ యూనియన్ నుంచి ఉక్రెయిన్‌ స్వాంతంత్ర్యం పొందాక.. భారత్‌కు ఇది రక్షణ, విద్య, వ్యవసాయం వంటి రంగాల్లో కీలక భాగస్వామిగా ఉంది.

రష్యా, ఉక్రెయిన్‌ మధ్య యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో సంబంధాలను నావిగేట్ చేయడం కూడా ఓ సవాలుగా మారింది. అమెరికా సారథ్యంలో పాశ్చాత్య దేశాలు రష్యాకు వ్యతిరేకంగా ఉండాలని ఆయా దేశాలపై ఒత్తిడి తీసుకొచ్చాయి. కానీ భారత్ మాత్రం చర్చలు, శాంతి కోసం తటస్థ వైఖరిని అవలంబించింది. ఉక్రెయిన్‌, రష్యా.. ఈ రెండు దేశాలతో కూడా భారత్‌ పరస్పర చర్చలు కొనసాగించింది. ఈ చర్చల వల్ల ప్రపంచ దేశాలు ఇప్పుడు భారత్ వైపు చూస్తున్నాయి. మరోవైపు అమెరికా అధ్యక్షుడు బైడెన్ కూడా మోదీ చర్యలను కొనియాడారు. త్వరలోనే భారత్‌.. ప్రపంచానికి శాంతి మార్గాన్ని బోధించే వేదభూమిగా తన స్థానాన్ని నిలుపుకుంటుందని పలువురు నిపుణులు చెబుతున్నారు.

Also Read: భారత్‌ వల్లే బంగ్లాలో వరదలు.. వంకరబుద్ధి పోనిచ్చుకోలేదంటూ విమర్శలు!

#telugu-news #russia #pm-modi #russia-ukraine-war
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe