తిరుమలకు ప్రధాని మోదీ, సీఎం జగన్

తెలంగాణ ఎన్నికల ప్రచారానికి ప్రధాని మోదీ బ్రేక్ వేశారు. ఈరోజు తిరుపతికి వెళ్లనున్నారు ప్రధాని మోదీ. రేపు తిరుమలలో శ్రీవారిని దర్శించుకోనున్నారు. అనంతరం తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్నారు.

తిరుమలకు ప్రధాని మోదీ, సీఎం జగన్
New Update

Modi Tirumala Tour: తెలంగాణలో కాషాయం జెండా ఎగురవేయాలని ఎన్నికలకు ముందు తెలంగాణలో పర్యటన చేపట్టారు ప్రధాని మోదీ (PM Modi). ప్రస్తుతం తెలంగాణ ఎన్నికల (Telangana Elections 2023) ప్రచారంలో బిజీగా ఉన్నారు. తెలంగాణలో ఉన్న మోదీ ఎన్నికల ప్రచారానికి బ్రేక్ వేశారు. మోదీ ఆంధ్రప్రదేశ్ కు వెళ్లనున్నారు. తిరుమలలో శ్రీవారిని దర్శించుకోనున్నారు.

ALSO READ: పెన్షన్ రూ.5000.. కేసీఆర్ సంచలన ప్రకటన!

కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు మధ్య ప్రధాని నరేంద్ర మోదీ తిరుమలలో పర్యటించనున్నారు. భధ్రతా ఏర్పాట్లలో 2 వేల మంది పోలీసులు ప్రధానికి భద్రత కల్పించనున్నారు. రాత్రి 7 గంటలకు తిరుపతి విమానాశ్రయంకు చేరుకోనున్న నరేంద్ర మోదీ. మోదీకి గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం జగన్, మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి స్వాగతం పలకనున్నారు.

రాత్రి 7:55 గంటలకు శ్రీ రచనా అతిధి గృహానికి ప్రధాని మోదీ చేరుకోనున్నారు. శ్రీరచనా అతిధి గృహం వద్ద టీటీడీ ఈవో ధర్మారెడ్డి, ఛైర్మన్ కరుణాకర్ రెడ్డి, శ్రీ రచనా అతిధి గృహాల డోనార్ తుమ్మల రచనా చౌదరి స్వాగతం పలకనున్నారు. రేపు ఉదయం స్వామివారిని సీఎం జగన్ తో కలిసి నరేంద్ర మోదీ దర్శించుకోనున్నారు.

#telangana-elections-2023 #cm-jagan #ap-news #pm-modi
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe