Telangana Tour : తెలంగాణపై బీజేపీ(BJP) అధిష్ఠానం ఫోకస్ పెట్టింది. ఏప్రిల్ 30న ప్రధాని మోదీ(PM Modi) రాష్ట్రానికి రానున్నారు. సంగారెడ్డి జిల్లా(Sangareddy District) అంధోల్‌లో ఏర్పాటు చేయనున్న భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు. అలాగే అదేరోజున శేరిలింగంపల్లిలోని ఐటీ ఉద్యోగులతో(IT Employees) ప్రధాని సమావేశమవుతారు. ఇక మే 3న వరంగల్, నల్గొండలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. అలాగే మే 4న నారాయణపేట్, వికారబాద్ సభల్లో పాల్గొంటారు.
Also Read: సంపద పునఃపంపిణీ మీద శామ్ పిట్రోడా ఆసక్తికర వ్యాఖ్యలు
ఇప్పటికే తెలంగాణలో.. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ మధ్య గట్టి పోటీ ఉండనుంది. ఇదిలాఉండగా ఏప్రిల్ 19 నుంచి మొదలైన పార్లమెంట్ ఎన్నికలు ఏడు దశల్లో జూన్ 1 వరకు జరగనున్నాయి. మే 13న తెలంగాణలో పార్లమెంటు ఎన్నికలు నిర్వహించనున్నారు. జూన్ 4న ఓట్ల లెక్కింపు ఉంటుంది.