Chandrayaan-3: జాబిల్లిపై చంద్రయాన్‌-3 ల్యాండింగ్ ని వీక్షించనున్న మోదీ..!

దక్షిణాఫ్రికా నుంచి వర్చువల్‌గా చంద్రయాన్-3 ల్యాండింగ్‌ని ప్రధాని నరేంద్ర మోదీ వీక్షించనున్నారు. దక్షిణాఫ్రికాలో మూడు రోజుల అధికారిక పర్యటనలో ఉన్న ప్రధాని.. 15వ బ్రిక్స్ సదస్సులో పాల్గొంటున్నారు. రేపు(ఆగస్టు 23) చంద్రయాన్‌-3 జాబిల్లిపై ల్యాండ్‌ అవ్వనుంది. సాయంత్రం 6 గంటల 4 నిమిషాలకు ల్యాండ్‌ అవ్వనుంది.

Chandrayaan-3: జాబిల్లిపై చంద్రయాన్‌-3 ల్యాండింగ్ ని వీక్షించనున్న మోదీ..!
New Update

దక్షిణాఫ్రికా నుంచి వర్చువల్‌గా చంద్రయాన్-3 ల్యాండింగ్‌ని ప్రధాని నరేంద్ర మోదీ వీక్షించనున్నారు. దక్షిణాఫ్రికాలో మూడు రోజుల అధికారిక పర్యటనలో ఉన్న ప్రధాని.. 15వ బ్రిక్స్ సదస్సులో పాల్గొంటున్నారు. రేపు(ఆగస్టు 23) చంద్రయాన్‌-3 జాబిల్లిపై ల్యాండ్‌ అవ్వనుంది. సాయంత్రం 6 గంటల 4 నిమిషాలకు ల్యాండ్‌ అవ్వనుంది.



యావత్‌ దేశం చూపు చంద్రయాన్‌ వైపు:

ఇంకా ఒక్కరోజు మాత్రమే మిగిలి ఉంది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో..అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ మిషన్‌వైపే అందరి చూపులు. యావత్‌ ప్రపంచం ఆ అద్భుత క్షణం కోసం ఎంతో ఉత్కంఠగా, ఆసక్తిగా ఎదురుచూస్తోంది. చంద్రయాన్‌-3 సక్సెసవ్వాలని ప్రార్థిస్తోంది. మరికొద్దిగంటల్లోనే ఆ చారిత్రక ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. చంద్రయాన్‌-3 విక్రమ్‌ ల్యాండర్‌ చంద్రుని దక్షిణ ధృవంపై అడుగుపెట్టబోతోంది. జూన్‌ 14 నెల్లూరు శ్రీహరికోటలోని షార్‌ నుంచి నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకెళ్లింది చంద్రయాన్‌-3. ముందుగా భూ కక్ష్యలోకి..ఆ తర్వాత చంద్రుని కక్ష్యలోకి ప్రవేశించిన స్పేస్‌క్రాఫ్ట్‌..చంద్రునికి మరింత చేరువైంది. ఇప్పటివరకు ఏ దేశం అడుగుపెట్టని దక్షిణ ధృవం దిశగా అడుగులు వేస్తోంది. సేఫ్‌ ల్యాండింగ్‌కు సరైన ప్రాంతం కోసం అన్వేషిస్తోంది. రేపు సాయంత్రం 6.04కు సాఫ్ట్‌ ల్యాండింగ్‌ అవనుంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే రేపు సాయంత్రం చంద్రుని దక్షిణ ధృవంపై కాలుమోపనుంది విక్రమ్‌ ల్యాండర్‌. ఆ తర్వాత రెండు వారాల పాటు ల్యాండర్‌, రోవర్‌ చంద్రుడి ఉపరితలంపై పరిశోధనలు సాగిస్తాయి. ఈ ప్రయోగం విజయవంతమైతే.. అమెరికా, రష్యా, చైనా తర్వాత జాబిల్లిపై కాలుమోపిన నాలుగో దేశంగా భారత్‌ అవతరించనుంది. ఇక, దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన తొలి దేశంగా సరికొత్త చరిత్రను లిఖించనుంది.



చంద్రుని దక్షిణ ధృవంపై దిగడమే చంద్రయాన్‌-3 లక్ష్యమన్నారు ఇస్రో మాజీ చైర్మన్‌ కే. శివన్‌. చంద్రయాన్‌-2 నుంచి పాఠాలు నేర్చుకొని చాలా మార్పులు చేశామన్నారు. ఈ మిషన్‌ విజయవంతమవుతుందని ధీమా వ్యక్తం చేశారు. జులై 14న ప్రయోగించిన చంద్రయాన్‌-3 విక్రమ్‌ ల్యాండర్‌ మాడ్యూల్‌..35 రోజుల తర్వాత ప్రొపల్షన్‌ మాడ్యూల్‌ నుంచి విజయవంతంగా విడిపోయింది. ఇక మరికొద్దిగంటల్లో 30కిలోమీటర్ల ఎత్తు నుంచి చంద్రుని ఉపరితలంపై ల్యాండవడానికి సిద్ధమైంది. ఆ సమయంలో దాని వేగం సెకనుకు 1.68కిలోమీటర్లుగా ఉంటుంది. ఆ వేగాన్ని తగ్గించడంపైనే మా దృష్టి ఉంటుంది. ఎందుకంటే చంద్రుని గురుత్వాకర్షణ శక్తి కూడా దాన్ని ప్లే చేస్తుంది. ఆ వేగాన్ని నియంత్రించకపోతే క్రాష్‌ ల్యాండింగ్‌ అయ్యే అవకాశాలున్నాయి. ఆగస్ట్‌ 23న ల్యాండర్‌ మాడ్యూల్‌ అసాధారణంగా కనిపిస్తే..ఆగస్ట్‌ 27కు ల్యాండింగ్‌ను వాయిదా వేస్తామని తెలిపారు ఇస్రో సైంటిస్ట్‌ నీలేష్‌ దేశాయ్‌. ఇక ఇలాంటి అపూర్వ ఘట్టం నేపథ్యంలో తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల్లో చంద్రయాన్‌-3 సేఫ్‌ ల్యాండింగ్‌ను విద్యార్థులు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూసేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది.

#narendra-modi #isro-chandrayaan-3 #modi
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe