ఈరోజు బెంగళూరులోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL)ను ప్రధాని నరేంద్ర మోదీ సందర్శించారు. ఇందులో భాగంగా ప్రధాని మోదీ స్వదేశీ యుద్ధ విమాన తేజస్-మార్క్ 2 తయారీ కేంద్రాన్ని సమీక్షించారు. ఆ తర్వాత తేజస్ యుద్ధ విమానాన్ని స్వయంగా నడిపారు మోదీ. యుద్ధ విమానాన్ని నడపడం అద్బఉతంగా ఉందని మోదీ చెప్పారు. దీని తర్వాత భారత కేపబిలిటీ మీద మరింత కాన్ఫిడెన్స్ పెరిగిందని ఆయన అన్నారు. భారత నైపుణ్యాలు తనను చాలా గర్వపడేలా చేస్తున్నాయని మోదీ పొగిడారు.
Also Read:అవకాశమున్న చోటల్లా తెలంగాణ కోసం బీజేపీ పనిచేస్తోంది-అమిత్ షా
తాజాగా భారత రక్షణ శాఖ 12 Su-30MKI యుద్ధ విమానాలను కొనుగోలు చేయడానికి HAL కు టెండర్ జారీ చేసింది. రష్యా పరికరాల తయారీ సంస్థలతో కలిసి హెచ్‌ఏఎల్ భారత్‌లో వీటిని తయారు చేయనుంది.స్వదేశీ యుద్ధ విమానం తేజస్-మార్క్ 2 ఇంజిన్ మన దేశంలోనే తయారుచేశారు.ఈ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రోటోటైప్ ఏడాదిలో సిద్ధమవుతుందని డీఆర్‌డీవో వర్గాలు చెబుతున్నాయి. ఆ తర్వాత వీటిని వైమానిక దళంలో చేర్చనున్నారు. ఇక ఇక్కడ తయారైన స్వదేశీ యుద్ధ విమానం కాక్‌పిట్‌లో నైట్ విజన్ గాగుల్స్ అమర్చారు. దీంతో రాత్రిపూట లేదా చీకట్లో యుద్ధ విమానాలతో లక్ష్యంపై దాడి చేయవచ్చును. గాగుల్స్ తో పాటూ హ్యాండ్-ఆన్ థొరెటల్-అండ్-స్టిక్ కూడా ఉంటుంది. దీంతో ఫైటర్ జెట్ ను నియంత్రించడంతో పాటు ఒకే లీవర్ నుంచి ఆయుధాలను కూడా పేల్చవచ్చును. మిరేజ్-2000, జాగ్వార్ మరియు మిగ్-21 వంటి పాత యుద్ధ విమానాల పాత విమానాలను భర్తీ చేయడం తేజస్ యుద్ధ విమానాల లక్ష్యం.