Pariksha Pe Charcha 2024: విద్యార్ధుల్లో మానసిక స్థైర్యాన్ని పెంపొందించేందుకు ప్రధాని మోడీ చేటపట్ఇన కార్యక్రమం పరీక్సా పే చర్చా. ఎగ్జామ్స్ ముందు పిల్లలు ఎలా ఉండాలి, ఏం చేయాలి అనే విషయాలను ఇందులో మోడీ చర్చిస్తారు. విద్యార్ధులు, తల్లిదండ్రులతో ముచ్చటిస్తారు. ఈరోజు ఏడవసారి ఈ చర్చా కార్యక్రమాన్ని నిర్వహించారు ప్రధాని. డిల్లీలోని భారత మండప్‌లో పిల్లలు, తల్లిదండ్రలుతో ఇంటరాక్ట్ అయ్యారు. విద్యార్ధులకు, తల్లిదండ్రులకు సూచనలిచ్చారు. పిల్లల మీద ఒత్తిడి తీసుకురాకూడదని సూచించారు.
పోల్చి చూడొద్దు...
మన పిల్లలను వేరే ఎవరితోనూ పోల్చి చూడడం మంచిది కాదని ప్రధాని మోడీ (PM Modi) అన్నారు. అలా చూడ్డం వలన వారి మానసిక ఆరోగ్యం దెబ్బ తింటుందని తెలిపారు. పిల్లల రిపోర్ట్ కార్డ్‌ను తల్లిదండ్రులు తమ విజిటింగ్ కార్డులా చూపించుకోవడం మానేయాలని మోడీ అన్నారు. దాన్ని పట్టుకుని వెళ్ళి ప్రతీ వారికి చూపించడం మానేయాలని సలహా ఇచ్చారు. తమ పిల్లల గురించి చెప్పుకోవడం పేరెంట్స్‌కు గొప్ప విషయమే అయినా అది వారిలో మానసిక ఒత్తిడిని పెంపొందిస్తుందని మోడీ అన్నారు. విద్యార్ధులు మన దేశ భవిష్యత్తును నిర్మిస్తారు. అందుకే వారిలో సృజనాత్మక పోకుండా చూడాలని అన్నారు. అలాగే టీచర్లు తమ పనిని కేవలం ఉద్యోగంగా భావించకూడదని మోడీ అన్నారు. భావిభారత పౌరులను తీర్చి దిద్దే సాధంగా మార్చుకోవాలని సూచించారు.
Also Read:sky diver:సాహసమే ప్రాణాలు తీసింది..29వ అంతస్తు నుంచి పడి స్కైడైవర్ మృతి
గాఢనిద్రలోకి వెళ్ళేందుకు టిప్స్...
ఇక విద్యార్ధులు ఒత్తిడిని తట్టుకుని గాఢనిద్రలోకి వెళ్ళేందుకు ప్రధాని మోడీ సలహాలు ఇచ్చారు. నిద్ర సక్రమంగా ఉంటేనే మెరుగైన ఫలితాలు వస్తాయని చెప్పారు. గాఢనిద్ర కోసం (Sleeping Tips) తాను పాటించే 3 చిట్కాలను విద్యార్ధులతో పంచుకున్నారు మోడీ. నిద్రలోకి వెళ్ళడానికి కేవలం 30 సెకెన్లు సరిపోతుందని అన్నారు. దాని కోసం ఆయన చెప్పిన చిట్కాల్లో మొదటిది. పడుకునేప్పుడు కేవలం పడుకోవడం మాత్రమే చేయాలని అన్నారు. ఒకసారి కళ్ళు మూసుకున్నాక బుర్రలోకి ఏ ఆలోచనా రాకూడదని చెప్పారు. దాని తరువాత గాఢ నిద్రకు సమతుల ఆహారం కూడా తినాలని సూచించారు. వయసును బట్టి ఆహారం తీసుకోవాలని చెప్పారు. ఇక మూడవ సూత్రంగా క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలని చెప్పారు ప్రధాని మోడీ. శరీరం అలిసిపోతేనే మంచి నిద్ర పడుతుందని అన్నారు మోడీ. దీని కోసం భారీ ఎక్సర్సైజులు ఏమీ చేయనక్కర్లేదని...తేలికపాటి వ్యాయామం కూడా సహకరిస్తుందని తెలిపారు.
ఇది నాకు కూడా పరీక్షే...
పరీక్షా పే చర్చా (Pariksha Pe Charcha) తనకు కూడా ఒక పరీక్షేనని అన్నారు ప్రధాని మోడీ. గత కొన్నేళ్ళుగా ఈ కార్యక్రమం నిర్హిస్తున్నారు. కోవిడ్ టైమ్‌లో ఆన్‌లైన్‌లో కూడా నిర్వహించారు. దీనికి విద్యార్ధులు, తల్లిదండ్రుల నుంచి కూడా మంచి ఆదరణ లభిస్తోంది. విద్యార్ధులు మన దేశ భవిష్యత్తును నిర్మిస్తారు. అందువల్ల తనకు కూడా ఈ కార్యక్రమం ఒక ఎగ్జామ్ లాంటిదేనని అన్నారు ప్రధాని. ఈ ఏడాది 2.26కోట్ల మంది పరీక్షా పే చర్చా కార్యక్రమానికి నమోదు చేసుకున్నారు.