Mann Ki Baat: మాన్‌ కీ బాత్‌కు బ్రేక్‌ ఇస్తున్నా.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా మూడు నెలల పాటు 'మాన్‌కీ బాత్‌' కార్యక్రమానికి విరామం ఇస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. అలాగే గతంలో మాదిరిగానే ఈసారి కూడా మార్చిలో ఎన్నికల ప్రవర్తన నియమావళి (Model Code of Conduct) అమల్లోకి వచ్చే అవకాశం ఉందని వెల్లడించారు.

Mann Ki Baat: మాన్‌ కీ బాత్‌కు బ్రేక్‌ ఇస్తున్నా.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
New Update

PM Modi Mann Ki Baat Break for 3 Months: ప్రధాని నరేంద్ర మోడీ ప్రతినెలలో చివరి ఆదివారం దేశ ప్రజలనుద్దేశించి 'మన్‌కీ బాత్‌' (Mann Ki Baat) పేరుతో రేడియో (Radio) ప్రసంగం చేస్తారన్న విషయం అందరికి తెలిసిందే. ప్రధాని చేసే ఈ ప్రసంగం కోసం కోట్లాదిమంది ప్రజలు ఎదురుచూస్తుంటారు. దేశ పురోగతి, నూతన ఆవిష్కరణలు, ప్రభుత్వ ప్రోత్సహకాలు, సంక్షేమ పథకాలు లాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను ఆయన ప్రజలతో పంచుకుంటారు. 2014లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. అదే ఏడాది అక్టోబర్‌ 10న ప్రధాని మోదీ మాన్‌కీ బాత్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అప్పటినుంచి ఇది విశేష ఆదరణతో ఇంకా కొనసాగతూ ఉంది. ఈనెల ఆదివారం నాటికి 110వ ఎపిసోడ్‌ పూర్తైంది. అయితే ఈసారి ప్రధాని కీలక విషయాలు వెల్లడించారు.

Also Read: అమెరికాలో భారత యువ జర్నలిస్ట్ మృతి..!

మూడు నెలలు బ్రేక్

లోక్‌సభ ఎన్నికలు (Lok Sabha Elections) నిర్వహించాల్సిన సమయం దగ్గరపడుతుండటంతో.. మాన్‌కీ బాత్ కార్యక్రమానికి మూడు నెలల పాటు విరామం ఇస్తున్నట్లు ప్రధాని మోదీ తెలియజేశారు. 2019 ఎన్నికల మాదిరిగానే.. ఈసారి కూడా మార్చిలో ఎన్నికల ప్రవర్తన నియమావళి (Model Code of Conduct) అమల్లోకి వచ్చే అవకాశం ఉందని వెల్లడించారు. ఇప్పటివరకు నిర్వహించిన 110 ఎపిసోడ్‌లు ప్రభుత్వంతో ఎలాంటి ప్రమేయం లేకుండా నిర్వహించామని తెలిపారు.

ఏప్రిల్‌లో ఎన్నికలు !

దేశ సామూహిక శక్తి, విజయానికి ఈ మాన్‌కీబాత్‌ ప్రసారం అంకితమన్నారు. ఈ కార్యక్రమం ప్రజలదని.. ప్రజల కోసం ప్రజల ద్వారానే రూపుదిద్దుకుందని పేర్కొన్నారు. తర్వాత నిర్వహించే 111వ ఎపిసోడ్‌ సంఖ్యకు విశిష్టత ఉందన్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో కూడా ప్రధాని మోదీ (PM Modi) మాన్‌కీ బాత్ కార్యక్రమానికి విరామం ఇచ్చారు. గతంలోలాగే ఈసారి కూడా ఏప్రిల్‌లో ఎన్నికలు, మే లో ఫలితాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు లోక్‌సభ ఎన్నికల కోసం అధికార, విపక్ష పార్టీలు రంగంలోకి దిగుతున్నాయి. మూడోసారి అధికారంలోకి రావాలని బీజేపీ.. ఎలాగైన మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని.. ఇండియా కూటమి గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే ఈసారి ప్రజలు కేంద్రంలో ఎవరికి అధికారిక పగ్గాలు అందిస్తారో తెలియాలంటే మరికొన్ని రోజుల పాటు వేచిచూడాల్సిందే.

Also Read: డ్రైవర్ లేకుండా 80 కి.మీ దూసుకెళ్లిన ట్రైన్‌.. తర్వాత ఏం జరిగిందంటే?

#telugu-news #pm-modi #national-news #lok-sabha-elections-2024 #mann-ki-baat
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe