PM Modi: రైతులకు ప్రయోజనం చేకూర్చే పథకాలపై పని చేస్తున్నాం: మోదీ రైతులకు మేలు చేసే పథకాలపై తమ ప్రభుత్వం పనిచేస్తోందని ప్రధాని మోదీ అన్నారు. గతంలో రైతులకు బ్యాంకులు రుణాలు కూడా ఇచ్చేవి కాదన్నారు. రైతులు ఆందోళన చేస్తున్న వేళ.. ప్రధాని మోదీ ఇలా వ్యాఖ్యానించడం చర్చనీయాంశమవుతోంది. By B Aravind 16 Feb 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి తమ డిమాండ్లు పరిష్కరించాలని ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు శుక్రవారం హర్యానాలో పర్యటించిన ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. రైతులకు మేలు చేసే పథకాలపై తమ ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. గతంలో రైతులకు బ్యాంకులు రుణాలు కూడా ఇచ్చేవి కాదన్నారు. కానీ వాటిపై తాము గ్యారంటీ ఇచ్చామని పేర్కొన్నారు. అయితే రైతులు ఆందోళన చేస్తున్న వేళ.. ప్రధాని మోదీ ఇలా వ్యాఖ్యానించడం చర్చనీయాంశమవుతోంది. Also Read: మాపై బలప్రయోగం చేస్తే ఊరుకునేది లేదు.. రైతు సంఘాల హెచ్చరిక ఎక్కడికి వెళ్లినా భారత్‌కు గౌరవం రేవాడీలో ఎయిమ్స్‌కు శంకుస్థాపన చేసిన అనంతరం బహిరంగ సభలో మాట్లాడిన ప్రధాని మోదీ కాంగ్రెస్ పార్టీ మళ్లీ విరుచుకుపడ్డారు. గతంలో శ్రీరాముడంటే ఊహ, అయోధ్యలో ఆలయ నిర్మాణం వద్దన్న వాళ్లే.. ఇప్పుడు జై సీతారామ్ అని నినదిస్తున్నారని చురకలంటించారు. ఆర్టికల్ 370 రద్దుకు కాంగ్రెస్ దశాబ్దాల పాటుగా అడ్డంకులు సృష్టించిందని విమర్శించారు. కానీ తమ ప్రభుత్వం మాత్రం దానిపై గ్యారెంటీ ఇచ్చి నెరవేర్చిందని పేర్కొన్నారు. గత పది సంవత్సరాల్లో ఇండియా.. అనేక కొత్త శిఖరాలను అధిరోహించిందని.. ఇప్పుడు ప్రపంచంలో ఏ చోటుకి వెళ్లినా కూడా భారత్‌ను గౌరవిస్తున్నారని తెలిపారు. 400పైగా స్థానాల్లో గెలుస్తాం ఒకప్పుడు 11వ స్థానంలో ఉన్న భారత్.. ఇప్పుడు అయిదవ ఆర్థిక శక్తిగా ఎదిగిందని వ్యాఖ్యానించారు. ఇదంతా మీ ఆశీర్వాదం వల్లే సాధ్యమైందని.. మూడోసారి కూడా తమకు అధికారం ఇచ్చి.. దేశాన్ని మూడో ఆర్థిక శక్తిగా అభివృద్ధి చేసేందుకు మరోసారి మీ ఆశిస్సులు కావాలని మోదీ ప్రజలను కోరారు. అలాగే వచ్చే లక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి 400లకు పైగా స్థానాలు వస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇదిలాఉండగా.. శుక్రవారం రైతు సంఘాలు గ్రామీణ భారత్ బంద్‌కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అయితే కేంద్రమంత్రులు రైతులతో మూడోసారి చర్చలు జరిపినప్పటికీ అవి విఫలమయ్యాయి. ఫిబ్రవరి 18న నాలుగోసారి చర్చలు జరిపేందుకు ఇరువైపులా ఏకాభిప్రాయం కుదిరింది. Also Read: కేజ్రీవాల్ కీలక నిర్ణయం.. మరోసారి అసెంబ్లీలో విశ్వాస తీర్మానం #congress #pm-modi #bjp #farmers-protest మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి