BJP Will Cross 370 Seats: లోక్‌సభ ఎన్నికలు (Lok Sabha Elections) దగ్గరపడుతున్నాయి. ఇప్పటికే అధికార, విపక్ష పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ (PM Modi) కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 370కి పైగా స్థానాల్లో గెలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. గత ఎన్నికలతో పోలిస్తే.. ఒక్కో బూత్‌లో 370 ఓట్లు అదనంగా పోలయ్యేలా చూసి.. బీజేపీని 370కి పైగా స్థానాల్లో గెలిపించాలని కార్యకర్తలను, ఓటర్లను కోరారు. ఆదివారం మధ్యప్రదేశ్‌లో ఆయన పర్యటించారు. అక్కడ రూ.7,550 కోట్లకు పైగా నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఝబువా జిల్లాలో బహిరంగ సభలో ప్రసంగించిన ప్రధాని.. ఎన్నికల ప్రచారం కోసం ఇక్కడికి రాలేదని.. ప్రజా సేవకుడిగా మాత్రమే వచ్చానని తెలిపారు.
Also Read: గాంధీయేతర నాయకులే టార్గెట్.. కాంగ్రెస్ పార్టీని కకావికలం చేసే మోడీ వ్యూహం
400 సీట్లు దాటుతాయి
మధ్యప్రదేశ్‌లో (Madhya Pradesh) డబుల్ ఇంజిన్ సర్కార్ డబుల్ స్పీడ్‌తో పనిచేస్తోందని అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు ఎటువైపు మొగ్గు చూపుతున్నారో.. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మీరే చెప్పేశారని అన్నారు. ప్రతిపక్ష పార్టీలకు చెందిన బడా నేతలు కూడా ఈసారి ఎన్డీయేకు 400 సీట్లు దాటుతాయని అంటున్నారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ (Congress Party) ఓడిపోవడం ఖాయమన్నారు. ఆ పార్టీకి ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే గ్రామాలు, రైతులు, పేదలు గుర్తుకొస్తారంటూ విమర్శించారు.
కిలోమీటర్ల కొద్ది నడిచేవాళ్లు
దేశాన్ని దోచుకోవడం, విభజించడమే కాంగ్రెస్ నినాదమని అన్నారు. గుజరాత్‌లో (Gujarat) గిరిజన ప్రాంతాల్లో స్కూల్లు లేకపోవడం పిల్లలు కిలోమీటర్ల కొద్ది నడవడం తాను చూశానని మోడీ అన్నారు. ముఖ్యమంత్రిని అయ్యాక ఆయా ప్రాంతాల్లో పాఠశాలలు ప్రారంభించానని.. ఇప్పుడు గిరిజన పిల్లల కోసం దేవ్యాప్తంగా ఏకలవ్య పాఠశాలలు ప్రారంభిస్తున్నామని అన్నారు. కాంగ్రెస్ ఇన్ని సంవత్సరాల్లో కేవలం 100 ఏకలవ్య స్కూళ్లు (Ekalavya schools) పెడితే.. బీజేపీ ప్రభుత్వం గత పదేళ్లలో భారీ సంఖ్యలో పాఠశాలలు ఏర్పాటు చేస్తోందని పేర్కొన్నారు.
Also Read: ‘ఛలో ఢిల్లీ’కి పిలుపునిచ్చిన రైతులు.. బార్డర్లు మూసేసిన ప్రభుత్వం