PM Modi: ప్రధాని మోదీ జీతమెంత ఉంటుందో తెలుసా ?

ప్రధాని మోదీ జూన్‌ 9న మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మూడోసారి ప్రధాని పదవి చేపట్టనున్న మోదీ జీతం ఎంత ఉంటుంది అనేదానిపై చాలామందికి ఆసక్తి నెలకొంది. వీటి వివరాలు తెలుసుకునేందుకు ఈ ఆర్టికల్‌ను చదవండి

New Update
Handloom Day : ఆగస్టు 7న ఆ దుస్తులే కొనండి.. దేశ ప్రజలకు మోదీ పిలుపు!

ప్రధాని మోదీ జూన్‌ 9న మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే. సాయంత్రం 7.15 PM గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది. పలు దేశాధినేతలు కూడా ఈ వేడుకకు హాజరుకానున్నారు. అయితే మూడోసారి ప్రధాని పీఠం ఎక్కబోతున్న నరేంద్ర మోదీ జీతం ఎంత ఉంటుంది అనేదానిపై చాలామందికి ఆసక్తి నెలకొంది. ప్రధాని నెల జీతం రూ.1.66 లక్షలు. ఇందులో బేసిక్ పే రూ.50 వేలు. దీనికి అదనంగా ప్రధానికి ఖర్చుల నిమిత్తం రూ.3 వేలు, పార్లమెంటరీ భత్యం కింద రూ.45 వేలు చెల్లిస్తారు.

Also Read: టీడీపీకి ప్రధాని మోదీ బంపర్‌ ఆఫర్

అలాగే వీటితోపాటు దినసరి భత్యం కింద రోజుకు రూ.2 వేలు వస్తాయి. ఇక ఉచిత నివాస సౌకర్యం, ఇతర సదుపాయాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. ఆయన ప్రయాణ ఖర్చులను సైతం ప్రభుత్వమే కల్పిస్తుంది. ప్రధానమంత్రి రక్షణ బాధ్యతను SPG పర్యవేక్షిస్తుంది.

Also Read: రెండు స్థానాల్లో గెలిచిన రాహుల్‌.. వదులుకోబోయే సీటు ఇదే

Advertisment
తాజా కథనాలు