PM Modi : ఎలక్టోరల్ బాండ్లు ఎదురు దెబ్బ ఎలా అవుతుంది-ప్రధాని మోదీ

ఎన్నికల బాండ్లు ద్వారా తాము విప్లవాత్మక మార్పు కోసం అడుగులు వేస్తున్నాం అంటున్నారు ప్రధాని మోదీ. ఈ బాండ్లు ఎవరికైనా ఎదురు దెబ్బ ఎలా అవుతుందని ప్రశ్నించారు. నిన్న ఒక తమిళ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎలక్టోరల్ బాండ్ల రద్దు అంశం మీద స్పందించారు.

New Update
Modi: మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రత్యేక అతిథులు.. లిస్ట్ చూస్తే ఆశ్యర్యపోతారు!

Modi On Electoral Bonds : ఈరోజుల్లో ఎన్నికల బాండ్లు(Electoral Bonds) చాలా అవసరం అంటున్నారు ప్రధాని మోదీ(PM Modi). దీని వలన ఎవరెవరు, ఎవరెవరికి విరాళాలు ఇస్తున్నారో తెలుస్తుంది అని చెబుతున్నారు. ఇదొక విప్లవాత్మక మార్పుకు శ్రీకారం అని తెలిపారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాక ముందు ఈ అవకాశం లేదని అన్నారు. నిన్న ఒక తమిళ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎలక్టోరల్ బాండ్ల మీద మోదీ స్పందించారు. దీనికి పంచెకట్టులో ప్రధాని మోదీ(PM Modi) ఈ ఇంటర్వ్యూకి హాజరు కావడం ఆకర్షణగా నిలిచింది.

లోపం లేకుండా ఏ వ్యవస్థా ఉండదు.. బాండ్ల వ్యవహారంలో ఎవరైనా ఎదరు దెబ్బ ఎలా తింటారు అని ప్రశ్నించారు ప్రధాని మోదీ. అంత ఇబ్బందికర పరిస్థితులు ఏం ఎదురయ్యాయో చెప్పాలని అడిగారు. విరాళాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎవరికి వెళ్తున్నాయి అనేది ఎలక్టోరల్ బాండ్ల వల్లే తెలుస్తోంది. 2014కి ముందు ఏ పార్టీకి ఎంతెంత విరాళాలు వచ్చాయో ఏ దర్యాప్తు సంస్థలు కూడా చెప్పలేవు. ప్రతీ పనిలో రాజకీయాలు చూడకూడదు. కొన్ని దేశం కోసం కూడా చేస్తామని అని చెప్పుకొచ్చారు. ఇప్పుడు గంతులు వేస్తూ గర్వపడుతున్నవారు తర్వాత పశ్చాత్తాపడతారని అన్నారు.

తాను రాజకీయనాయకుడు(Political Leader) అయినంత మాత్రాన కేవలం ఓట్ల కోసమే అన్ని పనులూ చేస్తానని అనుకోకూడదు. అలానే అయితే ఈశాన్య రాష్ట్రాలకు తాము అన్ని పనులు చేసి ఉండకూడదని చెప్పుకొచ్చారు. అందరి కన్నా తానే అక్కడకు ఎక్కువసార్లు వెళ్ళానని చెప్పారు ప్రధాని మోదీ. ఇక తమిళ ఓటర్లు ఈసారి తమకు పట్టం కడతారని ధీమా వ్యక్తం చేశారు. తమిళనాడులో విపరీతమైన సామరధ్యం ఉంది..దానిని వృధా చేయడం మాకు ఇష్టం లేదు. వికసిత్ భారత్ అంటే దూఏశంలో ప్రతీ మూల అభివృద్ధి చెందడమే అని చెప్పుకొచ్చారు. తమిళనాడు కూడా ఇందుకు ఓ కేంద్రంగా మారుతుందని నేను భావిస్తున్నా. ఇక్కడి మా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై అద్భుతంగా పని చేస్తున్నారు’’ అని ప్రధాని మోదీ కితాబిచ్చారు.

Also Read : Supreme Court : జ్ఞానవాపి మసీదులో పూజలు..నేడు సుప్రీంకోర్టులో కీలక విచారణ

Advertisment
తాజా కథనాలు