PM Modi : శరీర రంగుతో అవమానిస్తే ఊరుకునేది లేదు..శ్యామ్ పిట్రోడా వ్యాఖ్యలపై మండిపడ్డ ప్రధాని

శరీర రంగు మీద కాంగ్రెస్ నేత శ్యామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలను ప్రధాని మోదీ ఖండించారు. ఇది జాతి వివక్ష కిందకే వస్తుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశాన్ని ఎటు తీసుకుపోవాలనుకుంటున్నారంటూ ప్రతిపక్ష పార్టీపై మండిపడ్డారు.

PM Modi : శరీర రంగుతో అవమానిస్తే ఊరుకునేది లేదు..శ్యామ్ పిట్రోడా వ్యాఖ్యలపై మండిపడ్డ ప్రధాని
New Update

Sam Pitroda : దేశాన్ని విభజించి పాలించాలని కాంగ్రెస్(Congress) అనుకుంటోంది అని మండిపడ్డారు ప్రధాని మోడీ(PM Modi). శరీర రంగు ఆధారంగా ప్రజలను అవమానిస్తే దాన్ని తాము సంచమని ఆయన హెచ్చరించారు. దేశాన్ని కాంగ్రెస్ పార్టీ ఎటువైపు తీసుకెళ్ళాలని చూస్తోంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. భారతదేశం(India) లో చాలా మంది ప్రజలు నల్లగా ఉంటారు. దాని ఆధారంగా ఆ వ్యక్తి యోగ్యతను నిర్ణయిస్తారా? శ్రీకృష్ణుడి రంగు కూడా నలుపు అని గుర్తించాలని మోదీ అన్నారు. వరంగల్ మామునూరులో జరిగిన ఎన్నికల ప్రచార సభలో భాగంగా మోదీ శ్యామ్ పిట్రోడా కలర్ వ్యాఖ్యలపై స్పందించారు.

భారతీయులు ఆఫ్రికన్లలా..
భారతీయులు ఆఫ్రికన్లలా(Africans)  కనిపిస్తారంటూ ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ఛైర్మన్ శామ్ పిట్రోడా కొత్త వివాదానికి తెరలేపారు. అమెరికాలో తాను రేకెత్తించిన వారసత్వ పన్ను వ్యాఖ్యల మంటలను ఆర్పే క్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భారతీయులు “దక్షిణాదిలో ఆఫ్రికన్‌ల వలె కనిపిస్తారు – పశ్చిమాన ఉన్నవారు అరబ్బులు – తూర్పున ఉన్నవారు చైనీస్‌లా కనిపిస్తారు.” అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

ప్రపంచంలో ప్రజాస్వామ్యానికి భారతదేశం ఉజ్వలమైన ఉదాహరణ అని చెబుతూ పిట్రోడా “దేశంలోని ప్రజలు అక్కడక్కడా జరిగే తగాదాలను విడిచిపెట్టి కలిసి జీవించగలిగే చాలా సంతోషకరమైన వాతావరణంలో 75 సంవత్సరాలు జీవించారు” అని అన్నారు.

పిట్రోడా, ‘ది స్టేట్స్‌మన్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో, భారతదేశంలోని ప్రజాస్వామ్యాన్ని వివరిస్తూ.. “అక్కడక్కడ కొన్ని తగాదాలను పక్కనపెట్టి, ప్రజలు కలిసి జీవించగలిగే చాలా సంతోషకరమైన వాతావరణంలో మేము 75 సంవత్సరాలు జీవించాము. తూర్పున ఉన్న ప్రజలు చైనీస్‌లా, పశ్చిమాన ప్రజలు అరబ్‌లా, ఉత్తరాన ఉన్నవారు తెల్లవారిలా – దక్షిణాది ప్రజలు ఆఫ్రికన్‌లలా కనిపించే భారతదేశం వలె విభిన్నమైన దేశాన్ని మనం కలిపి ఉంచగలం.’’ అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

భారతదేశ ప్రజలు వివిధ భాషలు, మతం, ఆహారం – ఆచారాలను గౌరవిస్తారని, ఇది ప్రాంతాలను బట్టి మారుతుందని ఆయన అన్నారు. “ఇది నేను విశ్వసించే భారతదేశం, ఇక్కడ ప్రతి ఒక్కరికీ స్థానం ఉంటుంది. ప్రతి ఒక్కరూ కొంచెం రాజీపడతారు,” అని ప్రిటోడా(Sam Pitroda) చెప్పారు.

Also Read:Modi: మోదీకి బిగ్ షాక్.. ప్రధాని అయిన తర్వాత ఇలా జరగడం తొలిసారి!

#telangana #pm-modi #sam-pitroda #color
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe