PM Modi : పార్లమెంట్ ఎన్నిక(Parliament Elections) లకు కేవలం కొన్ని రోజుల ముందు కేంద్రంలోని బీజేపీ(BJP) బిగ్ షాక్ తగిలింది. హర్యానాలో ఏర్పడిన రాజకీయ సంక్షోభం కమలనాథులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఆరుగురు ఇండిపెండెంట్లలో ముగ్గురు బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నారు. ఈ మేరకు వారు గవర్నర్‌కు లేఖ రాశారు. తాము లోక్‌సభ ఎన్నిక(Lok Sabha Elections)ల్లో కాంగ్రెస్‌కు మద్దతిస్తున్నట్లు స్వతంత్ర ఎమ్మెల్యేలు సోంబిర్ సంగ్వాన్, రణ్‌ధీర్ గొల్లెన్, ధరమ్‌పాల్ గొండెర్ ప్రకటించారు. రోహ్‌తక్‌లో మాజీ సీఎం, కాంగ్రెస్ నేత భూపేందర్ సింగ్ హుడా, హర్యానా పీసీసీ అధ్యక్షుడు ఉదయ్‌భాన్‌తో కలిసి వారు ప్రెస్‌మీట్ నిర్వహించారు.
పూర్తిగా చదవండి..BJP : మోదీకి బిగ్ షాక్.. ప్రధాని అయిన తర్వాత ఇలా జరగడం తొలిసారి!
హర్యానాలో బీజేపీ ప్రభుత్వం పడిపోయే పరిస్థితి ఏర్పడడం కమలనాథులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. 2014లో మోదీ పీఎం అయిన తర్వాత ఏ రాష్ట్రంలోనూ బీజేపీ ప్రభుత్వానికి ఇలాంటి ఇబ్బందికర పరిస్థితి ఏర్పడలేదన్న చర్చ సాగుతోంది.
Translate this News: