AI Technology : ఆర్టిఫిషియల్ టెక్నాలజీ(Artificial Technology) ఇప్పుడు ప్రపంచాన్ని ఏలుతోంది. దీన్ని ఉపయోగించుకుని చేయలేని లేదు. ఏఐ(AI) తో మన హీరోల ఫోటోలు రకరకాలుగా మర్చి... అద్భుతంగా సృష్టించారు. అవి ఎంత వైరల్ అయ్యాయో మనకు తెలుసు. ఇప్పుడు అదే పనిని దేశాధినేతల ఫోటోలతో చేస్తున్నారు. ఏఐ టెక్నాలజీతో పలు దేశాల నేతలను చిన్నపిల్లలుగా మర్చి చూపిస్తున్నారు. దీంతో ఇప్పుడు 60 ఏళ్ళకు పైబడి ఉన్న నేతలు అందరూ ముద్దుగా, చిన్న పిల్లలుగా మారిపోయారు. దీనికి సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది. పోస్ట్ చేసిప్పటి దగ్గర నుంచి ఇప్పటి వరకు 145.3 వేల వ్యూస్ వచ్చాయి ఈ వీడియోకు.
ఎంత ముద్దుగా ఉన్నారో...
ఈ వీడియోలో ప్రధాని నరేంద్ర మోదీ(PM Narendra Modi), అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్ స్కోల్జ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వంటి ప్రముఖ నేతలు ఉన్నారు.వీరితో పాటూ ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, పోప్ ఫ్రాన్సిస్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో లాంటి నేతలందరూ చిన్న పిల్లల్లా మారిపోయి కనిపిస్తున్నారు. Asking AI To Draw World Leaders As Babies అనే క్యాప్షన్‌తో మాసిమో అనే యూజర్ ఈ వీడియోను పోస్ట్ చేశారు. ఏఐతో సృష్టించి ఫోటోలు ఇప్పుడు అందరినీ తెగ ఆకట్టుకుంటున్నాయి. ఒక్కొక్క నేత ఎంత ముద్దుగా ఉన్నారో అంటూ కామెంట్లు కూడా వస్తున్నాయి.
Also Read : Zomato : కస్టమర్లకు బిగ్ షాక్.. ఛార్జీలు పెంచిన జొమాటో