PM Modi Telangana Tour : లోక్‌సభ ఎన్నికలు(Lok Sabha Elections) దగ్గరికొస్తున్నాయి. అధికార, విపక్ష పార్టీలు ఎన్నికల రంగంలోకి దిగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ ఈరోజు(సోమవారం) తెలంగాణ(Telangana) కు రానున్నారు. రెండు రోజుల పాటు ఆయన రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈరోజు ఆదిలాబాద్.. అలాగే రేపు సంగారెడ్డి కి ప్రధాని వెళ్లనున్నారు. ఇవాళ ఉదయం 10.20 AM గంటలకు ఆయన ఆదిలాబాద్‌కు చేరుకోనున్నారు. ప్రధానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), మంత్రి సీతక్క(Minister Seethakka), గవర్నర్ తమిళిసై(Governor Tamilisai) స్వాగతం పలకనున్నారు.
Also Read: ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి
ఆ తర్వాత మోదీ(PM Modi).. రూ.6,697 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. ఇందులో భాగంగా.. రామగుండం నేషనల్ థర్మల్ పవర్ ప్రాజెక్టు(National Thermal Power Project) ను ప్రారంభించి.. జాతికి అంకితం చేయనున్నారు. అలాగే హైదరాబాద్(Hyderabad) నుంచి భూపాలపట్నం వరకూ రూ.2,136 కోట్లతో నిర్మించిన నేషనల్ హైవే 163ని ప్రారంభించనున్నారు. వీటితో పాటు మరికొన్ని ప్రాజెక్టులు ప్రారంభించనున్నారు. అనంతరం ఆయన బహిరంగ సభలో పాల్గొనున్నారు. మధ్యాహ్నం 12.30కి ఆదిలాబాద్(Adilabad) జిల్లాలో ప్రధాని పర్యటన ముగుస్తుంది. తర్వాత మోదీ.. తమిళనాడుకి వెళ్తారు. తిరిగి రాత్రి 7.45 PMకి మళ్లీ హైదరాబాద్‌కి వచ్చి రాజ్‌భవన్‌లో బస చేస్తారు.
రేపు ఉదయం 11.00 AM గంటలకు సంగారెడ్డి(Sangareddy) జిల్లాకి ప్రధాని చేరుకుంటారు. అక్కడ రూ.9,021 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఈ సందర్భంగా అక్కడ నిర్మించిన ఐఐటీ, నేషనల్ హైవేలు, గ్యాస్ పైప్‌లైన్ వంటి వాటిని ప్రారంభించి, జాతికి అంకితం చేయనున్నారు. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రధాని రాష్ట్రాల పర్యటనలు చేస్తున్నారు. రాబోయే పది రోజుల్లో ఆయన దేశవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేయనున్నారు.
Also Read : కాంగ్రెస్‌లోకి మరో బీజేపీ నేత?