PM Modi: తెలుగు స్పీచ్ తో అదరగొడుతున్న మోదీ.. టెక్నాలజీని ఇలా ఫుల్లుగా వాడేస్తున్న బీజేపీ!

సోషల్ మీడియాను అత్యంత సమర్ధవంతంగా వాడుకోమంటే బీజేపీ, ప్రధాని మోదీ తర్వాతనే ఎవరైనా. ఇప్పుడు ఇందులో ఒక అడుగు ముందు వేశారు ప్రధాని మోదీ. నమో ఇన్ తెలుగు అనే ట్విట్టర్ అకౌంట్‌ను మొదలుపెట్టి అందులో ఏఐ ద్వారా తన ప్రసంగాలన్నింటినీ తెలగులో వినండి అని చెబుతున్నారు.

PM Modi: తెలుగు స్పీచ్ తో అదరగొడుతున్న మోదీ.. టెక్నాలజీని ఇలా ఫుల్లుగా వాడేస్తున్న బీజేపీ!
New Update

Namo In Telugu: ప్రజల్లోకి ఎలా వెళ్ళాలో ప్రధాని మోదీకి తెలిసినట్టుగా మరెవ్వరికీ తెలియదు. ప్రధాని అయిన దగ్గర నుంచి ప్రజలకు అతి చేరుగా ఉండడానికి ప్రయత్నిస్తున్నారు ప్రధాని. దీనికి సోషల్ మీడియాను తన ప్రధాన ఆయుధంగా తీసుకున్నారు. మోదీ ఎక్కడకు వెళ్ళినా...అక్కడ ఫోటోలు లేదా వీడియోలు వెంటనే సోసల్ మీడియాలో అప్లోడ్ అయిపోవాల్సిందే. దీని కోసం ఏకంగా ఒక టీమ్‌ను పెట్టుకుంది పీఎమ్‌వో. ఇప్పుడు తాజాగా ప్రధాని మోదీ టీమ్ సోషల్ మీడియా వాడకంలో మరో అడుగు ముందు వేసింది. ఇందులో భాగంగా ఏఐ టెక్నాలజీని ఎడాపెడా వాడేసుకోవాలని డిసైడ్ అయిపోయింది.

ప్రస్తుతం ఏఐ యుగం నడుస్తోంది. దీంతో చేయలేని పని లేదు. ఇప్పుడు దీన్నే ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తమ ప్రధాన అస్త్రంగా వాడుకుంటున్నారు ప్రధాని మోదీ అండ్ టీమ్. ముఖ్యంగా తెలుగు వాళ్ళని టార్గెట్ చేశారు. నమో ఇన్ తెలుగు పేరుతో ఒక ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేశారు. ఇందులో ప్రధాని ప్రచారాలను, ప్రసంగాలను ఏఐ ద్వారా తెలుగులో ట్రాన్స్‌లేట్ చేసి వదులుతున్నారు.

హిందీలో ఉండే ప్రధాని మోదీ ప్రసంగాన్ని ఏఐ తెలుగులోకి మార్చేస్తుంది. అంతేకాదు...దాన్ని అచ్చు గుద్దినట్టు తెలుగులోనే వినిపించేస్తుంది కూడా. అయితే అది ప్రధాని గొంతుతో కాకుండా వేరే గొంతుతో ఉంటుంది. కానీ వీడియోలో మోదీనే కనిపిస్తారు కాబట్టి ఆయనే మాట్లాడుతున్న ఫీల్ వస్తుంది.

ముచ్చటగా మూడోసారి కూడా గెలిచి విజయకేతనం ఎగురవేయాలని భావిస్తోంది బీజేపీ. ఈసారి కూడా అధిక్యం సంపాదించి మళ్ళీ ప్రధాని కిరీటం పెట్టుకోవాలని డిసైడ్ అయ్యారు మోదీ. అందుకే అన్ని రాష్ట్రాల మీద దృష్టి పెట్టారు. 400 సీట్లు టార్గెట్‌గా ప్రచారాలను చేస్తున్నారు. ఇందులో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా పర్యటిస్తున్నారు మోదీ.

ఈమధ్య జరిగిన చిలకలూరి పేట బహిరంగ సబలో ప్రదాని మోదీ మాట్లాడుతూ ఈ నమో ఇన్ తెలుగు గురించి చెప్పారు. తెలుగు ప్రజలందరూ తనకొక మాట ఇవ్వాలని...మీ కోసం తీసుకు వస్తున్న నమో ఇన్ తెలుగును ఫాలో అవుతామని మోదీ వాగ్దానం తీసుకున్నారు.

మొత్తానికి ప్రజల పల్స్ పట్టుకోవడంలో ప్రధాని మోదీ ఎప్పుడూ ముందుంటారు. అందులోనే ఇలాంటి సోషల్ మీడియా జిమ్మిక్కుల విషయంలో ఇంకా ముందుంటారు. ఈ ట్విట్టర్ అకౌంట్‌కు ఇప్పటివరకు 4, 600మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇందులో కొంతమంది బీజేపీ సపోర్టలు మాత్రం అద్భుతం, అమోఘం అని పొగిడేస్తుంటే...ఇవన్నీ ఎలక్షన్ ముందు స్టంట్స్ అని మరి కొందరు విమర్శిస్తున్నారు. అయితే ఇంకా కొంతమంది మాత్రం తెలుగులో వచ్చే వాయిస్ బాలేదని...ప్రధానికి ఆ గొంతు సూట్ అవ్వడం లేదని కామెంట్లు పెడుతున్నారు. వాయిస్‌ను మారిస్తే బావుంటుందని సలహాలిస్తున్నారు.

publive-image

Also Read:Supreme Court: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కీలక పరిణామం..బోయనపల్లి అభిషేక్‌కు బెయిల్

#pm-modi #social-media #ai #namo-in-telugu
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe