National: నీతి అయోగ్ అధికారులు, ఆర్ధిక వేత్తలతో ప్రధాని మోదీ భేటీ

మూడోసారి అధికారంలో వచ్చిన మోదీ సర్కార్ మొదటిసారి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. ఈనెల 22 నుంచి పార్లమెంటు సమావేశాలు మొదలవుతున్న నేపథ్యంలో బడ్జెట్ కసరత్తులో భాగంగా నీతి ఆయోగ్ అధికారులతో ప్రధాని భేటీ అయ్యారు.

National: నీతి అయోగ్ అధికారులు, ఆర్ధిక వేత్తలతో ప్రధాని మోదీ భేటీ
New Update

PM MOdi: ఈ నెల 23వ తేదీన పార్లమెంటు సమావేశాల్లో కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. మోడీ 3.0 తొలిసారిగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ ఇది. ఈనెల 22 నుంచి పార్లమెంటు సమావేశాలు మొదలవనున్నాయి. మర్నాడే బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు. గత రెండు సార్లులా కాకుండా..ఈ సారి మిత్రపక్షాల సపోర్ట్‌తో ఎన్డీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దీంతో మిత్రపక్షాలకు సంబంధించిన రాష్ట్రాలు బడ్జెట్ మీద చాలా ఆశలు పెట్టకున్నాయి. అందుకే ప్రధాని మోదీ కూడా ఈసారి బడ్జెట్ మీద ఫుల్ ఫోకస్ పెట్టారు. రష్యా, ఆస్ట్రియా పర్యటనలు ముగించుకుని వచ్చిన ప్రధాని దీని కోసం ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. నీతి అయోగ్ అధికారులు, ఆర్ధిక వేత్లతో భేటీ అయ్యారు.

ప్రధాని మోదీతో పాటూ ఈ సమావేశంలో ఈ సమావేశానికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌.. ప్రణాళిక మంత్రి రావు ఇంద్రజిత్ సింగ్, ముఖ్య ఆర్థిక సలహాదారు వి అనంత నాగేశ్వరన్, ఆర్థికవేత్త సూర్జిత్ భల్లా, వ్యవసాయ ఆర్థికవేత్త అశోక్ గులాటి, ప్రముఖ బ్యాంకర్ కెవి కామత్ పాల్గొన్నారు. దీనికన్నా ముందు ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌పై తమ అభిప్రాయాలను సేకరించేందుకు ఇప్పటికే భారతీయ పారిశ్రామికవేత్తలు, రాష్ట్ర ఆర్థిక మంత్రులు, ఆర్థికవేత్తలతో విస్తృత చర్చలు జరిపారు. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా ఈ బడ్జెట్‌ను రూపొందించాలని ప్రధాని మోదీ, ఆర్ధిక మంత్రి భావిస్తున్నారు.

లోక్‌సభ ఎన్నికలకు ముందు నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఇప్పుడు 2024-25 కోసం పూర్తి బడ్జెట్‌ను సమర్పించనున్నారు. మధ్యతరగతి ప్రజలకు కొంత ఉపశమనం కలిగించేందుకు ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని పెంచాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Also Read:TG DSC: తెలంగాణ డీఎస్సీ హాల్ టికెట్స్ విడుదల.. డౌన్‌లోడ్ లింక్ ఇదే!

#budjet #nirmala-seeta-raman #pm-modi #parliament
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe