PM Modi Interacts With Top Gamers: భారత్‌లో గేమ్స్‌కి మంచి క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. ఎంతోమంది తమ మొబైల్ ఫోన్సు, కంప్యూటర్లలో గేమ్స్ ఆడుతూ ఎంజాయ్ చేస్తుంటారు. అంతేకాదు కాదు.. కొందరు గేమర్స్ యూట్యూబ్ ఛానల్స్ పెట్టి.. లైవ్‌లో గేమ్స్ ఆడుతూ డబ్బులు కూడా సంపాదిస్తున్నారు. అయితే తాజాగా ప్రధాని మోదీ.. మనదేశంలోని టాప్ గేమర్స్‌తో సమావేశమయ్యారు. వారితో కలిసి గేమింగ్ ఇండస్ట్రీ గురించి, అలాగే ఇటీవల ఈ రంగంలో వచ్చిన తాజా మార్పులు, ఆవిష్కరణల గురించి ప్రధాని చర్చించారు. అలాగే దేశంలో గేమర్స్ టాలెంట్‌ను, సృజనాత్మకతను ప్రధాని ప్రశంసించారు.
Also Read: లోక్‌సభ ఎన్నికల్లో ఇందిరాగాంధీ హంతకుడి కొడుకు పోటీ..
అయితే గేమర్స్‌తో సమావేశం ముగిశాక.. ప్రధాని మోదీ వాళ్లతో కలిసి మొబైల్, పీసీ, వీఆర్ ఆధారిత గేమ్స్ ఆడారు. ఇందుకు సంబంధించిన టీజర్ వీడియోని బీజేపీ ఎక్స్(ట్విట్టర్)లో విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వీడియో కూడా త్వరలో విడుదల చేస్తామని తెలిపింది. ఈ ఫుల్ వీడియో.. ఏప్రిల్ 13న విడుదల అయ్యే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ప్రధాని మోదీతో కలిసి ఈ సమావేశంలో పాల్గొన్న గేమర్స్ సంతోషం వ్యక్తం చేశారు.
;
Also Read: ఎన్నికల సిబ్బంది నిబంధనలు ఉల్లంఘిస్తే జరిగేది ఇదే..!