Narendra Modi : రూ. 1600 కోట్ల పెట్టుబడితో నిర్మించిన బోయింగ్‌ కేంద్రాన్ని ప్రారంభించిన ప్రధాని మోడీ!

బెంగళూరులో బోయింగ్‌ కేంద్రాన్ని శుక్రవారం ప్రధాని మోడీ ప్రారంభించారు. అమెరికా వెలుపల అతి పెద్ద కేంద్రం ఇదే అని తెలిపారు. దీనివల్ల విమానయాన రంగంలో యువతులు మరింత దూసుకుపోయే అవకాశాలున్నట్లు తెలుస్తుంది

New Update
Narendra Modi : రూ. 1600 కోట్ల పెట్టుబడితో నిర్మించిన బోయింగ్‌ కేంద్రాన్ని ప్రారంభించిన ప్రధాని మోడీ!

Boeing Center : అమెరికా వెలుపల అతి పెద్ద బోయింగ్‌ కేంద్రాన్ని బెంగళూరు(Bangalore) లో ప్రధాని మంత్రి మోడీ(PM Modi) శుక్రవారం ప్రారంభించారు. రోజురోజుకి విమానయాన రంగంలో వస్తున్న మార్పులను ఎదుర్కొనేందుకు ఈ కంపెనీ ఇంజనీరింగ్‌, టెక్నాలజీ కేంద్రాన్ని రూపొందించింది. ఈ కేంద్రంలో అభివృద్ధి, పరిశోధన, డిజైన్‌, కొత్త ఆవిష్కరణలు వంటి వాటి మీద దృష్టి పెడతారు.

మేక్‌ ఇన్‌ ఇండియా, మేక్‌ ఫర్‌ ది వరల్డ్‌...

ఈ కేంద్రంతో భారత్‌ లోని ప్రతిభ పై ప్రపంచానికి నమ్మకం ఏర్పడుతుందని మోడీ అన్నారు. '' మేక్‌ ఇన్‌ ఇండియా, మేక్‌ ఫర్‌ ది వరల్డ్‌'' (Make In India, Make for The World) లో ఓ భాగమే ఈ కేంద్రం అని మోడీ పేర్కొన్నారు. నేడు భారత్‌ లో 15 శాతం మంది మహిళ పైలెట్లే ఉన్నారని వివరించారు. ఇది ప్రపంచ సగటు కంటే మూడు రెట్లు అని మోడీ తెలిపారు.

బోయింగ్‌ సుకన్య ప్రోగ్రామ్‌(Boeing Sukanya Programme) ద్వారా పైలట్‌ కావాలనుకునే యువతుల కల సాకారం అవుతుందని ప్రధాని అన్నారు. బోయింగ్‌(Boeing) కు చెందిన బెంగళూరు క్యాంపస్‌ భవిష్యతులో భారత్‌ లో తయారైన అత్యాధునిక విమానాలను ప్రపంచానికి అందించడానికి సిద్దంగా ఉంటుందని మోడీ ఆశాభావం వ్యక్తం చేశారు.

బెంగళూరు నగరం ఎన్నో కొత్త ప్రయోగాలకు, విజయాలకు నిలయం గా మారిందని ప్రశసించారు. ప్రపంచంలోని సాంకేతిక డిమాండ్‌ ను తీర్చేందుకు బెంగళూరు ఎప్పుడూ ముందుంటుందన్నారు. ఈ క్యాంపస్‌ సుమారు 43 ఎకరాలలో విస్తరించి ఉంది. దీనిని రూ. 1600 కోట్లతో బోయింగ్‌ ఇండియా ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ సెంటర్‌ గా తీర్చిదిద్దారు.

అమెరికా బయట ఉన్న వాటిలో అతి పెద్ద బోయింగ్‌ కేంద్రం ఈ బెంగళూరుదే అని చెప్పవచ్చు. ఈ బోయింగ్‌ కేంద్రం కొత్త స్టార్ట్‌ప్‌ లు, ప్రైవేట్‌, భాగస్వామ్యాలను మెరుగుపరచడానికి పని చేస్తుందని సమాచారం. ఈ బోయింగ్‌ కేంద్రంలో సుమారు 3000 మందికి పైగా ఇంజనీర్లు కలిసి పని చేస్తారని అధికారులు వివరించారు.

భారత సైన్యంతో కలిసి...

ఈ కేంద్రం నుంచి ప్రపంచ ఏరోస్పేస్‌, రక్షణ పరిశ్రమ కోసం తరువాత తరం ఉత్పత్తులు, సేవలను అభివృద్ధి చేయవచ్చని తెలుస్తోంది. ఈ బోయింగ్‌ కేంద్రం భారత సైన్యంతో కలిసి పని చేస్తుంది. భారత రక్షణ రంగంలో ఇది ముఖ్యమైన మైలురాయి అని చెప్పుకొవచ్చు. ఈ బోయింగ్‌ కేంద్రం వల్ల దేశంలోని యువతులకు మంచి అవకాశం అని చెప్పవచ్చు.

విమానయాన రంగంలో యువతులు మరింత దూసుకుపోయే అవకాశాలున్నట్లు తెలుస్తుంది. ఈ కేంద్రంలో యువతులు సైన్స్‌, టెక్నాలజీ, ఇంజనీరింగ్‌, మ్యాథ్స్‌ వంటి రంగాల్లో శిక్షణ పొందుతారు. ఈ కార్యక్రమంలో కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాట్లాడుతూ రాష్ట్రానికి ఇది గౌరవప్రదమన్నారు. దేశ సాంకేతిక అభివృద్ధికి కర్ణాటక ఎప్పుడూ ముందుంటుందని పేర్కొన్నారు.

Also read: అయోధ్య బాల రాముని విగ్రహం చుట్టూ దశావతారాలు!

Advertisment
తాజా కథనాలు