Modi : రూ. 13 కోట్ల విలువైన ప్రాజెక్టులకు నేడు శంకుస్థాపన చేయనున్న మోదీ!

ప్రధానమంత్రి నరేంద్రమోడీ మంగళవారం నాడు జమ్మూలో  పర్యటించనున్నారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాన మంత్రి రూ. 30,500 కోట్ల‌కు పైగా విలువైన ప‌లు అభివృద్ధి ప‌థ‌కాల‌కు శంకుస్థాప‌న చేయ‌నున్నారు.విద్యా రంగంలో 13,375 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు మోడీ శంకుస్థాపన చేస్తారు

New Update
PM Modi: రేపు ప్రధానిగా మోదీ ప్రమాణస్వీకారం.. ఢిల్లీలో నో ఫ్లయింగ్‌ జోన్‌

PM Modi : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ(PM Narendra Modi) మంగళవారం నాడు జమ్మూలో(Jammu)  పర్యటించనున్నారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాన మంత్రి రూ. 30,500 కోట్ల‌కు పైగా విలువైన ప‌లు అభివృద్ధి ప‌థ‌కాల‌కు శంకుస్థాప‌న చేయ‌నున్నారు. పీఎంఓ తెలిపిన వివరాల ప్రకారం, అనేక ఇతర ప్రధాన ప్రాజెక్టులతో పాటు, విద్యా రంగంలో సుమారు 13,375 కోట్ల రూపాయల విలువైన అనేక ప్రాజెక్టులకు మోడీ ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేస్తారు. ఇందులో ఐఐటీ భిలాయ్, ఐఐటీ తిరుపతి, ఐఐటీ జమ్మూ, ఐఐఐటీడీఎం కర్నూల్ వంటి ప్రాజెక్టులు దేశానికి అంకితం చేయనున్నట్లు అధికారులు వివరించారు.

అలాగే ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్కిల్స్(IIS), కాన్పూర్‌లో ఉన్న అధునాతన సాంకేతికత ఆధారంగా ఒక మార్గదర్శక నైపుణ్య శిక్షణా సంస్థ, దేవప్రయాగ్(ఉత్తరాఖండ్), అగర్తల (త్రిపుర) లో సెంట్రల్ సంస్కృత విశ్వవిద్యాలయానికి సంబంధించిన 2 క్యాంపస్‌లు. అదే సమయంలో, ప్రధాని దేశంలోని 3 కొత్త ఐఐఎం(IIM) లను అంటే ఐఐఎం జమ్మూ, ఐఐఎం బోధ్ గయా, ఐఐఎం విశాఖపట్నంలను కూడా ప్రారంభిస్తారు. ఇదిలా ఉంటే దేశ వ్యాప్తంగా మోదీ కేంద్రీయ విద్యాలయాలకు 20 కొత్త భవనాలు, 13 కొత్త నవోదయ విద్యాలయ భవనాలను కూడా ప్రారంభిస్తారు.

ఎయిమ్స్‌ను కూడా...

ఇది కాకుండా, దేశవ్యాప్తంగా మరో 5 కేంద్రీయ విద్యాలయ క్యాంపస్‌లు, ఒక నవోదయ విద్యాలయ క్యాంపస్(Navodaya Vidyalaya Campus), నవోదయ విద్యాలయాల కోసం ఐదు మల్టీపర్పస్ భవనాల శంకుస్థాపనను కూడా ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. కొత్తగా నిర్మించిన ఈ కేవీ, ఎన్‌ వీ భవనాలు దేశవ్యాప్తంగా విద్యార్థుల విద్యా అవసరాలను తీర్చడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని పీఎంఓ తెలిపింది.

అంతేకాకుండా, 2019 ఫిబ్రవరిలో ప్రధానమంత్రి శంకుస్థాపన చేసిన ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(AIIMS), విజయపూర్ (సాంబా), జమ్మూని కూడా మోదీ ప్రారంభిస్తారని పీఎంఓ వివరించింది.

Also Read : ప్రభుత్వ ప్రతిపాదనను తిరస్కరించిన రైతు సంఘాలు.. బుధవారం ఢిల్లీకి పయనం!

Advertisment
తాజా కథనాలు