Ram Lalla idol Gift:ఫ్రాన్స్ అధ్యక్షుడికి రామ్ లల్లా విగ్రహాన్ని కానుకగా ఇచ్చిన ప్రధాని మోడీ

రిపబ్లిక్ డే ముఖ్య అతిధిగా హాజరయిన ఫ్రాన్స్ అధ్యక్షునికి ప్రధాని మోడీ అద్భుతమైన బహుమతిని ఇచ్చారు. ఇటీవల అయోధ్య ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని రామ్ లల్లా విగ్రహాన్ని ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్‌కు అందజేశారు. అచ్చు రామ్ లల్లా విగ్రహం మాదిరిగా ఉండే బొమ్మను ఇచ్చారు.

Ram Lalla idol Gift:ఫ్రాన్స్ అధ్యక్షుడికి రామ్ లల్లా విగ్రహాన్ని కానుకగా ఇచ్చిన ప్రధాని మోడీ
New Update

France President Emmanuel Macron : రిపబ్లిక్ డే ముఖ్య అతిధిగా ఆహ్వానం అందుకున్న ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ ఈరోజు భారత దేశానికి వచ్చారు. రెండు రోజు లపాటూ ఆయన బారతదేశంలో పర్యటించనున్నారు. నిన్న జైపూర్‌కు చేరుకున్న మెక్కాన్ అక్కడ ఆమెర్ కోటను సందర్శించారు. ప్రధాని మోడీ (PM Modi) ఫ్రాన్స్ అధ్యక్షుడిని రిసీవ్ చేసుకుని ఆయనతో పాటూ కోటను సందర్శించారు. కోట దగ్గర ఉన్న హస్తకళల దుకాణంలో అయోధ్య రామ మందిర (Ayodhya Ram Mandir) నమూనాను కొనుగోలు చేసి బహూకరించారు. దానితో పాటూ రామ్ లల్లా విగ్రహాన్ని పోలిన బొమ్మను కూడా కొనిచ్చారు. తరువాత నేతలిద్దరూ సాహూ చాయ్ వాలా దగ్గర మసాలా టీ తాగుతూ కబుర్లు చెప్పుకున్నారు. అనంతరం ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొన్నారు. ఇక ఈరోజు డిల్లీ చేరుకుని గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.

Also Read:ద వన్ అండ్ ఓన్లీ ప్లేయర్..మరో సరికొత్త రికార్డ్‌తో విరాట్ కోహ్లీ చరిత్ర

భారత విద్యార్ధులకు మెక్రాన్ కానుక...

భారతీయ విద్యార్ధులనుద్దేశించి ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ (Emmanuel Macron) కీలక ప్రకటన చేశారు. ఇండియన్ స్టూడెంట్స్ (Indian Students) ఫ్రాన్స్‌లో మరింత ఎక్కువ చదువుకునే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. 2030 నాటాకా దాదాపు 30 వేల మంది విద్యార్ధులను అహ్వానించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. దీనికి ఫ్రాన్స్ ప్రభుత్వం ఏం చేయనున్నదో వివరంగా తెలిపారు. ఫ్రెంచ్ మాట్లాడలేని విద్యార్ధుల కోసం యూనివర్శిటీల్లో ప్రత్యేకంగా క్లాసులను నిర్వహిస్తామని...పలు సంస్థల భాగస్వామ్యంతో నెట్ వర్క్‌ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. అలాగే పూర్వ విద్యార్ధులకు వీసా సౌకర్యం కూడా కల్పిస్తామని చెప్పారు.

ఇది ఆరవసారి...

రిపబ్లిక్ డే (Republic Day 2024) పరేడ్ కు భారత దేశానికి ఫ్రాన్స్ అధ్యక్షుడు రావడం ఇది ఆరవసారి. 1950 నుండి భారతదేశం గణతంత్ర దినోత్సవ వేడుకలకు అత్యధిక సంఖ్యలో ఆహ్వానాలను అందుకున్న ఏకైక దేశంగా ఫ్రాన్స్ ప్రత్యేకతను సంపాదించుకుంది. మొదటిసారి 1976లో, ఫ్రాన్స్ మాజీ ప్రధాని జాక్వెస్ చిరాక్ (Jacques Chirac) భారతదేశ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా ఆహ్వానించబడిన మొట్టమొదటి నాయకుడిగా నిలిచారు. తరువాత 1980లో ఫ్రెంచ్ ప్రెసిడెంట్ వాలెరీ గిస్కార్డ్ డి ఎస్టేయింగ్‌ను రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్య అతిథిగా భారతదేశం ఆహ్వానించింది. దీని తరువాత 1998లో అప్పటి ఫ్రెంచ్ ప్రెసిడెంట్ జాక్వెస్ చిరాక్‌ వచ్చారు. 2016లో ప్రెసిడెంట్ ఫ్రాంకోయిస్ హోలాండే భారత రిపబ్లిక్ డే పరేడ్‌కు ముఖ్య అతిథిగా హాజరు కాగా, 2008లో అధ్యక్షుడు నికోలస్ సర్కోజీని ఆ కార్యక్రమానికి అతిథిగా దేశం ఆహ్వానించింది. ఇప్పుడు ఆ లిస్ట్ లోకి ఇమాన్యెయెల్ మెక్రాన్ కూడా చేరారు.

#ram-lalla-idol #ayodhya-temple #french-president-emmanuel-macron #republic-day-2024 #pm-modi
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe