/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-2024-04-11T150801.096-jpg.webp)
Modi reacted to Elon Musk Tweet: లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. మూడోసారి ప్రధానిగా మోదీ బాధ్యతలు స్వీకరించబోతున్నారు. నెహ్రూ తరువాత ఈ ఘనత సాధించిన వ్యక్తిగా మోదీ నిలిచారు. ఈ నేపథ్యంలో ప్రపంచ నేతలు, ప్రముఖులు ఆయనను అభినందనలతో ముంచేస్తున్నారు. శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్లు చేస్తున్నారు.
తాజాగా టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కూడా ప్రధాని మోదీకి అభినందనలు తెలిపారు. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య ఎన్నికల్లో గెలుపొందినందుకు శుభాకాంక్షలు అని అన్నారు. దాంతో పాటూ తమ కంపెనీలు భారతదేశంలో పెట్టుబడులు, పనులు చేయడానికి ఉత్సాహంగా ఉందని అన్నారు.
Congratulations @narendramodi on your victory in the world’s largest democratic elections! Looking forward to my companies doing exciting work in India.
— Elon Musk (@elonmusk) June 7, 2024
ఎలాన్ మస్క్ ట్వీట్‌కు ప్రధాని మోదీ రిప్లై ఇచ్చారు. ప్రజాస్వామ్యం, శాంతిభద్రతలు ఉన్న తమ దేశంలో టాలెంటెడ్ యువత చాలా మంది ఉన్నారని చెబుతూ...తామందరం ఎలాన్ మస్క్ కంపెనీలు భారత్‌లో పని చేసేందుకు అనుకూలమైన వాతావరణం కల్పిస్తామని హామీ ఇచ్చారు. దాంతో పాటూ భారత్‌లో టెస్లా దాని అనుబంధ సంస్థల పురోగతికి సహాయపడతామని తెలిపారు.
Appreciate your greetings @elonmusk. The talented Indian youth, our demography, predictable policies and stable democratic polity will continue to provide the business environment for all our partners. https://t.co/NJ6XembkyB
— Narendra Modi (@narendramodi) June 8, 2024
Also Read:NEET 2024:నీట్ ఫలితాలపై వివాదం..పరీక్షలు మళ్ళీ జరపాలంటున్న తల్లిదండ్రులు