Odisha : ఒడిశాలో మోదీ పర్యటన..కాషాయమయం అయిన రోడ్లు

తెలుగు రాష్ట్రాలతో పాటూ ఒడిశాలో కూడా మే 13నే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అక్కడ బీజేపీ తన ప్రచారాన్ని ముమ్మురం చేసింది. ఇందులో బాగంగా ఈరోజు ప్రధాని మోదీ ఒడిశాలో పర్యటించనున్నారు.

PM Modi : 8న మోదీ ప్రమాణ స్వీకారం.. ఆ డేట్ తో ప్రధానికి ఉన్న సెంటిమెంట్ ఇదే!
New Update

PM Modi Election Campaign : మే 13న జరిగే ఎన్నికల పోలింగ్(Election Polling) కోసం చాలా రాష్ట్రాలు సిద్ధమవుతున్నాయి. అందులో ఒడిశా(Odisha) ఒకటి. మరో రెండు రోజుల్లో పోలింగ్(Polling) జరగనుంది. దాని కారణంగా ఈరోజుతో అక్కడ కూడా ఎన్నికల ప్రచారానికి తెర పడనుంది. ఈ క్రమంలో ప్రధాని మోదీ(PM Modi) ఈరోజు ఒడిశాలో పర్యటించనున్నారు. ఉదయం 10.30 గంటలకు కంధమాల్‌లో, 12.15 గంటలకు బోలంగీర్‌లో, మధ్యాహ్నం 1.45 గంటలకు బర్ ఘర్‌లో ప్రసంగిస్తారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు జార్ఖండ్‌లోని ఛత్రాలో ప్రచారంలో పాల్గొంటారు. దీంతో ప్రధాని పర్యటించే ప్రాంతాలు అన్నీ సందడిగా మారాయి. బీజేపీ(BJP) జెండాలు, ఫ్లెక్సీలతో కాషాయాన్ని పులుముకున్నాయి. దాంతో పాటూ ప్రధాన మోదీ ఏం మాట్లాడతారా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఒడిశాలో ప్రస్తుత ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తిరుగలేని నేతగా ఉన్నారు. చాలా ఏళ్ళుగా ఆయనే ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ఈసారి నవీన్ ట్నాయక్‌ను ఎలా అయినా ఓడించాలని అక్కడ బీజేపీ ప్రయత్నిస్తోంది. ఒడిశాలో డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుందనే ప్రచారాన్ని వేగంగా ప్రజల్లోకి తీసుకెళ్తోంది. ఇందులో భాగంగా భువనేశ్వర్ లోక్‌సభ స్థానం, దాని పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్‌లలో ప్రచారంలో భాగంగా ప్రధాని రోడ్ షో నిర్వహించనున్నారు.

Also Read:AP : ఈ జిల్లాల్లో జగన్, చంద్రబాబు చివరి ప్రచారం.. ఎక్కడెక్కడంటే?

#pm-modi #odisha #bjp-election-campaign #elections2024
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe