PM Modi : ప్రధాని మోదీకి సొంత ఇల్లు, కారు లేదు..

వారణాసిలో నిన్న నామినేషన్ దాఖలు చేసిన ప్రధాని మోదీ తన ఆస్తుల వివరాలను అఫిడవిట్‌లో వివరించారు. తన మొత్త ఆస్తి విలువ రూ.3.02 కోట్లు ఉన్నట్లు అందులో తెలిపారు. తనకు సొంత ఇల్లు, కారు లేదని పేర్కొన్నారు.

New Update
PM Modi : ప్రధాని మోదీకి సొంత ఇల్లు, కారు లేదు..

PM Modi Doesn't Have Own House - Car : దేశంలో నాలుగు విడుతల్లో లోక్‌సభ ఎన్నికలు(Lok Sabha Elections) పూర్తయ్యాయి. మరో మూడు విడుతల్లో పోలింగ్(Polling) జరగనుంది. ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh) లోని వారణాసి నుంచి పోటి చేస్తున్న ప్రధాని మోదీ(PM Modi) మంగళవారం నామినేషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన తన ఆస్తుల వివరాలను ఎన్నికల అఫిడవిట్‌లో వివరించారు. తన మొత్త ఆస్తి విలువ రూ.3.02 కోట్లు ఉన్నట్లు అందులో వివరించారు. సొంత ఇల్లు, కారు లేదని పేర్కొన్నారు.

Also Read: ముంబై హోర్డింగ్‌ ప్రమాదంలో వెలుగులోకి దారుణ విషయాలు!

తన ఆస్తిలో రూ.2.86 కోట్లు SBIలో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసినట్లు తెలిపారు. గాంధీనగర్, వారణాసిలో ఉన్న బ్యాంక్‌ అకౌంట్లలో రూ.80,304 నగదు ఉందని చెప్పారు. ఇవి కాకుండా ప్రస్తుతం తన వద్ద రూ.52,920 నగదు, రూ.2.68 లక్షల విలువైన నాలుగు బంగారు ఉంగరాలు ఉన్నాయని అఫిడవిట్‌లో వివరించారు. ఇక నేషనల్ సేవింగ్స్‌ సర్టిఫికేట్‌లో ప్రధాని రూ.9.12 లక్షలు ఇన్వెస్ట్ చేశారు.

2018 నుంచి 2019లో రూ.11.14 లక్షలుగా ఉన్న తన ఆదాయం 2022-23లో రూ.23.56 లక్షలకు పెరిగిందని తెలిపారు. ఇక ప్రధాని మోదీ.. 1978లో ఢిల్లీ యూనివర్సిటీలోని బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ (B.A), 1983లో గుజరాత్ యూనివర్సిటీలో మాస్టర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ (M.A) పూర్తి చేసినట్లు అఫిడవిట్‌లో తెలిపారు. అలాగే ఇప్పటివరకు తనపై ఒక్క క్రిమినల్ కేసు కూడా లేదని చెప్పారు. ఏడో విడుతలో భాగంగా జూన్1న వారణాసిలో ఎన్నికలు జరగనున్నాయి.

Also Read: బ్యాంకును మోసం చేసిన కేసులో డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ డైరెక్టర్‌ అరెస్ట్‌!

Advertisment
తాజా కథనాలు