Pm Modi:జీ7 కోసం ఇటలీకి బయలుదేరిన ప్రధాని మోదీ

గ్లోబల్ సమ్మిట్ సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోదీ ఇటలీ బయలుదేరారు.మూడోసారి ప్రధాని అయిన తర్వాత మోదీకి ఇదే మొదటి విదేశీ పర్యటన. జీ7 చర్చల్లో భాగంగా కృత్రిమ మేధ, ఇంధనం, ఆఫ్రికా, మధ్యధరా, గ్లోబల్‌ సౌత్‌ అంశాలపై ప్రధానంగా దృష్టి సారిస్తామని ఆయన తెలిపారు.

New Update
Pm Modi:జీ7 కోసం ఇటలీకి బయలుదేరిన ప్రధాని మోదీ

G7 Summit: ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానం మేరకు జీ7 దేశాల ఇయర్లీ సమావేశంలో పాల్గొనేందుకు ప్రధాని మీద ఈరోజు ఇటలీ బయలుదేరారు. ఈ శిఖారగ్ర సమావేశంలో పాల్గొంటున్నందుకు ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఇటీవల భారత్‌లో జరిగిన జీ 20 సమీవేశాలను ఇప్పుడు జీ7 సమ్మిట్ ఫలితాలతో సమస్వయం చేసేందుకు ప్రయత్నిస్తానని ప్రధాని మోదీ చెప్పారు. గ్లోబల్ సౌత్‌కు కీలకమైన అంశాలపై చర్చించడానికి ఇది ఒక అవకాశమని ఆయన అన్నారు. మూడోసారి ప్రధానిగా బాధ్యతలు తీసుకున్న మోదీకి ఇదే మొదటి విదేశీ ప్రయాణం. జీ7 చర్చల్లో భాగంగా కృత్రిమ మేధ, ఇంధనం, ఆఫ్రికా, మధ్యధరా, గ్లోబల్‌ సౌత్‌ అంశాలపై ప్రధానంగా దృష్టి సారించనున్నట్లు ఆయన తెలిపారు.

ఇటలీలోని బోర్గో ఎగ్నాజియా ప్రాంతంలోని జీ7 దేశాల సదస్సు ప్రారంభమైంది. జూన్ 13 నుంచి 15 వరకు ఇవి జరగనున్నాయి. అమెరికా, ఫ్రాన్స్‌ అధ్యక్షులు జో బైడెన్‌, ఇమాన్యుయేల్‌ మెక్రాన్‌, జపాన్‌, కెనడా, బ్రిటన్‌ ప్రధానులు ఫుమియో కిషిదా, జస్టిన్‌ ట్రూడో, రిషి సునాక్‌, జర్మనీ ఛాన్స్‌లర్‌ ఓలాఫ్‌ షోల్జ్‌ తదితర నేతలు ఇప్పటికే అక్కడికి చేరుకున్నారు. జార్జియా మెలోనీ వారికి స్వాగతం పలికారు. జూన్ 14న జరిగే సమావేశంలో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. దీంతో పాటూ అన్ని దేశాల అధ్యక్షులు, ప్రధానలుతో చర్చలు జరిపేందుకు కూడా తాను ఎదురు చూస్తున్నాని మోదీ తెల్పారు. ఇక జీ7 సమావేశాల తర్వాత భారతదేశం, ఇటలీల మధ్య దౌత్య మరియు సాంస్కృతిక మార్పిడిని పెంపొందించే సాంస్కృతిక కార్యక్రమాలలో ఇంకా ఇటాలియన్ ప్రధాన మంత్రి జార్జియా మెలోని అందించే విందులో కూడా ప్రధాని పాల్గొననున్నారు.

Also Read:Andhra Pradesh: అప్పటి నుంచి పెన్షన్లను ఇస్తాము..ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం

Advertisment
తాజా కథనాలు