New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-2024-04-20T150616.578-jpg.webp)
AP News: ఏపీలో వరద పరిస్థితులపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రధాని మోదీ ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వపరంగా అన్ని సహాయ సహకారాలు అందిస్తామని మోదీ హామీ ఇచ్చారు. ఇక వరద సహాయ చర్యలపై ప్రధానికి చంద్రబాబు వివరించగా.. కేంద్ర ప్రభుత్వంలోని ఆయా శాఖలకు ఆదేశాలు ఇచ్చామని, రాష్ట్రానికి అవసరమైన సహాయం చేయాలని ఆదేశించానని మోదీ తెలిపారు. తక్షణమే ఆయా శాఖల నుంచి రాష్ట్రానికి అవసరమైన సామాగ్రి పంపేందుకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. కేంద్ర సహాయంపై ప్రధానికి చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు.
తాజా కథనాలు
Follow Us