PM Kisan : రైతులకు కీలక అప్‌డేట్‌.. పీఎం కిసాన్‌ 17వ విడత నిధుల ఎప్పుడంటే?

మీరు రైతు కిసాన్ 17వ విడత ప్రయోజనం పొందాలనుకుంటే e-KYC, భూమి రికార్డులను వీలైనంత త్వరగా పథకంలో ధృవీకరించాలి. రానున్న జూన్‌లో 17వ విడత విడుదలయ్యే అవకాశం ఉంది. పీఎం కిసాన్‌ కింద కేంద్ర ప్రతీఏడాది రైతులకు రూ.6వేల చొప్పున సాయం ఇస్తుంది.

PM Kisan : రైతులకు కీలక అప్‌డేట్‌.. పీఎం కిసాన్‌ 17వ విడత నిధుల ఎప్పుడంటే?
New Update

Farmers Update : నగరాలు(Cities), గ్రామీణ ప్రాంతాల్లో(Rural Areas) నివసించే ప్రజల కోసం రాష్ట్రం, కేంద్రం అనేక పథకాలను అమలు చేస్తూ ఉంటాయి. పేద ప్రజలకు ప్రయోజనాలను అందించడం ప్రభుత్వాల లక్ష్యం. వీటిలో పీఎం రైతు కిసాన్‌(PM Kisan) ఒకటి. ఈ పథకం కింద అర్హులైన రైతులకు సంవత్సరానికి రూ.6,000 అందజేస్తారు. ఈ డబ్బును ప్రతి నాలుగు నెలలకు రూ.2,000 చొప్పున మూడు విడతలుగా అందిస్తారు. ఈసారి పథకం తదుపరి విడత అంటే 17వ విడత కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. కాబట్టి 17వ విడత ఎప్పుడు విడుదల అవుతుందో తెలుసుకుందాం!

--> వాస్తవానికి ఈ పథకం కింద ఇప్పటి వరకు అర్హులైన రైతులు 16 వాయిదాలు పొందారు. గత ఫిబ్రవరి 28న 9 కోట్ల మంది రైతులకు 16వ విడత రుణమాఫీ జరిగింది. DBT ద్వారా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ డబ్బును నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేశారు.

--> పథకం ప్రతి విడత దాదాపు 4 నెలల తర్వాత ఇస్తారు. ఫిబ్రవరిలో 16వ విడత విడుదలైంది కాబట్టి జూన్‌లో 17వ విడత విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే దీనికి సంబంధించి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

--> PM కిసాన్ యోజన కింద ఏదైనా వాయిదా విడుదలైనప్పుడు, దాని పూర్తి సమాచారం పథకం అధికారిక పోర్టల్ pmkisan.gov.in లో ఇస్తారు. తేదీలు, ఇతర సమాచారాన్ని ఇక్కడ చెక్ చేయవచ్చు.

--> మీరు 17వ విడత ప్రయోజనం పొందాలనుకుంటే e-KYC, భూమి రికార్డులను వీలైనంత త్వరగా పథకంలో ధృవీకరించాలి.

--> మీరు ఈ రెండు ముఖ్యమైన పనులను పూర్తి చేయకపోతే తదుపరి 17వ విడత ప్రయోజనం పొందలేరు. ఇది కాకుండా, పథకానికి దరఖాస్తు చేసేటప్పుడు ఏదైనా తప్పుడు సమాచారాన్ని నమోదు చేస్తే 17వ విడత ప్రయోజనం లభించదు.

Also Read : మీ లవర్‌తో ఎంజాయ్ చేసేందుకు హైదరాబాద్‌లోని రొమాంటిక్ స్పాట్స్ ఇవే!

#pm-kisan #e-kyc #rural-areas
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe