PM Kisan Scheme: రైతులకు శుభవార్త. ఏంటా గుడ్ న్యూస్ అనుకుంటున్నారా?అక్కడికే వస్తున్నాం. పీఎం కిసాన్ డబ్బులు ముందుగానే బ్యాంకు అకౌంట్లో పడొచ్చని నివేదికలు చెబుతున్నాయి. ఇదే జరిగితే చాలా మంది రైతులకు ఊరట లభిస్తుంది. ఇంతకు ఎందుకని రైతుల బ్యాంకు అకౌంట్లో డబ్బులు ముందుగానే వేసేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తుందో తెలుసుకుందాం.
కేంద్రంలోని మోదీ (PM Modi) ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అన్నదాతల కోసం పీఎం కిసాన్ స్కీం (PM Kisan Scheme)ను తీసుకువచ్చింది. ఈ స్కీం ద్వారా అర్హత కలిగిన రైతులకు ప్రతిఏటా డబ్బులు అందిస్తోంది. నేరుగా బ్యాంకు అకౌంట్లోకి డబ్బులను జమ చేస్తోంది. ప్రతిఏటా ఈ స్కీం కింద రైతులకు రూ. 6వేలు అందిస్తుంది. మూడు విడతల్లో ఈ డబ్బులు జమ చేస్తోంది. అంటే రూ. 2వేల చొప్పున ఏడాదిలో 3సార్లు ఈ డబ్బులను బ్యాంకు అకౌంట్లో జమ చేస్తుంది. భారత ప్రభుత్వం ఇఫ్పటివరకు దాదాపు 15 విడతల డబ్బులను రైతుల అకౌంట్లోకి వేసింది. అంటే రూ. 30వేల రూపాయలు ఒక్కో రైతు అకౌంట్లో జమ అయ్యాయాని అర్థం. ఇది చాలా మంచి పరిణామం అని చెప్పవచ్చు. అయితే ఇప్పుడు మరో విడత డబ్బులు జమ కావాల్సి ఉంది.
మార్చి చివరికల్లా డబ్బులు జమ:
పీఎం కిసాన్ స్కీం 16వ విడత డబ్బులు మార్చి నెల చివరికల్లా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసే అవకాశం ఉందని నివేదికలు పేర్కొంటున్నాయి. అయితే ఇప్పుడు ఈ 16వ విడత డబ్బులపై మరో కీలక అప్ డేట్ వచ్చింది. పలు నివేదికల ప్రకారం..ఈ పీఎం కిసాన్ 16వ విడత డబ్బులు ముందుగానే రైతుల బ్యాంకు ఖాతాల్లో పడే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనికి ప్రధాన కారణాలు చాలా ఉన్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ మార్చిలో వచ్చే అవకాశం ఉందని కొందరు అంటుంటే..కొందరు ఫిబ్రవరి నెలలో కూడా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు. ఇంకా కేంద్రం ఫిబ్రవరి 1న బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతుంది.
ఎన్నికల నోటిఫికేషన్, బడ్జెట్:
ఎన్నికల నోటిఫికేషన్ (Election Notification), బడ్జెట్ (Budget) నేపథ్యంలో కేంద్రం రైతుల ఖాతాల్లో ముందుగానే డబ్బులు జమ చేసే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి. ఇదే జరిగితే రైతుల అకౌంట్లో ముందుగానే డబ్బులు పడటంతో వారికి ఊరట లభిస్తుంది. అయితే ఈ అంశంపై కేంద్రం నుంచి ఎలాంటి ప్రకటన మాత్రం రాలేదు. అందువల్ల డబ్బులు ముందుగా వస్తాయా లేదా అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పేందుకు వీలు లేదు. ఇది కేవలం అంచనాలు మాత్రమే. ఇంకోవైపు పీఎం కిసాన్ ఆర్థిక సాయం కూడా పెరగవచ్చనే అంచనాలు వినిపిస్తున్నాయి. ఎన్నికల ఏడాది నేపథ్యంలో కేంద్రం బడ్జెట్ లో పీఎం కిసాన్ సాయాన్ని రూ. 6వేల నుంచి 8వేలకు పెంచే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై కూడా సర్కార్ నుంచి ఎలాంటి క్లారిటీ లేదు.