Kejriwal: నాకు ఆ పుస్తకాలు కావాలి

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్ట్ అయిన కేజ్రీవాల్‌ను ఈరోజు అధికారులు తీహార్ జైలుకు తరలిస్తున్నారు. రౌస్ అవెన్యూ కోర్టు ఆయనకు జ్యూడీషియల్ రిమాండ్ విధించింది. ఈ నేపథ్యంలో తనకు జైల్లో చదువుకునేందుకు మూడు పుస్తకాలు కావాలని అడిగారు కేజ్రీవాల్.

New Update
Kejriwal: నాకు ఆ పుస్తకాలు కావాలి

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ మనీ లాండరింగ్ కేసులో ముఖ్యమంత్రి అరెస్ట్ అయ్యారు. ఈయనకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో కేజ్రీవాల్‌ను (Arvind Kejriwal) ఈరోజు తీహార్ జైలుకు తరలిస్తున్నారు. అయితే జైల్లో తనకు స్పెషల్ డైట్ ఆహారంతో పాటూ మందులు, పుస్తకాలు లాంటివి ఇప్పించాలని కేజ్రీవాల్ కోర్టును కోరారు. దాంతో పాటూ తనకు ప్రత్యేకంగా మూడు పుస్తకాలు కావాలని కోర్టుకు అభ్యర్ధనలు చేశారు. ఆయన తరుఫు న్యాయవాది దీనికి సంబంధించి అప్లికేషన్ సమర్పించారు.

చదువుకేనేందుకు పుస్తకాలు...

జైల్లో ఉన్నప్పుడు తనకు చదువుకునేందుకు ప్రత్యేకంగా మూడు పుస్తకాలు (Books) కావాలని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కోరారు. రామాయణం, భగవద్గీత, జర్నలిస్టు నీరజా చౌదరీ రాసిన హౌ ప్రైమ్ మినిస్టర్ డిసైడ్ పుస్తకాలు జైల్లో అందుబాటులో ఉంచాలని కోరారు. అలాగే తనను ఉంచే రూములో ఒక టేబుల్, మెడిసన్స్, డైట్ ప్రకారం ఆహారం అందించాలని అడిగారు. దాంతో పాటూ తాను రోజూ ధరించే లాకెట్‌ను కొనసాగించేందుకు అనుమతించాలని కోరారు.

Also Read: మళ్ళీ వంకర బుద్ధి చూపించిన చైనా..అరుణాచల్ ప్రాంతాలకు సొంతపేర్లు

Advertisment
తాజా కథనాలు