Telangana Elections 2023: ప్రచారంలో భాగంగా పటాన్ చెరు నియోజకవర్గంలో పర్యటించిన బండి సంజయ్ (Bandi Sanjay) బీఆర్ఎస్ (BRS), కాంగ్రెస్ (Congress) పార్టీలపై విమర్శల వర్షం కురిపించారు. "సీఎం కేసీఆర్ (CM KCR) రెండు సలాంలు చేస్తాడు.. పగలు దారుస్సలాం అంటడు… సాయంత్రం ‘‘దారు’’కు సలాం చేస్తున్నడు… అట్లాంటి తాగుబోతును డిప్యూటీ సీఎం అల్లాతో పోల్చడం సిగ్గు చేటు… అల్లాను ఏ విధంగా కించపరుస్తున్నారో ముస్లిం సమాజం ఆలోచించాలి’’ అని అన్నారు.
ALSO READ: సీఎం కేసీఆర్ చరిత్ర సరిగ్గా చదవలేదు.. చిదంబరం కీలక వ్యాఖ్యలు
కాంగ్రెస్ పార్టీ ముస్లిం మత పెద్దలను నమ్ముకుందని, కేసీఆర్ ఎంఐఎంను (MIM) నమ్ముకున్నాడని అన్నారు. ముస్లిం ఓట్లను ఏకం చేసేందుకు వారి మత పెద్దలు తిరుగుతున్నారని ఆరోపించారు. సాధు సంతువులు, అర్చకులంతా బయటకు వచ్చి 80 శాతం ఓట్లను ఏకం చేసి హిందూ సంఘటిత శక్తిని చాటాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కలిసే పనిచేస్తున్నాయని ఆరోపించారు. 6 గ్యారంటీలు కాదు… అమ్ముడుపోరనే ఒక్క గ్యారంటీ ఇవ్వగలరా? అని కాంగ్రెస్ నేతలను ప్రశ్నించారు. డబుల్ ఇంజిన్ సర్కార్ తోనే సుస్థిర పాలన సాధ్యమవుతుందని అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే తెలంగాణ శ్రీలంకలా మారే ప్రమాదం ఉందని అన్నారు.
ALSO READ: మెటాస్టాటిక్ క్యాన్సర్ తో చనిపోయిన సహారా ఛీఫ్..అసలేంటిది?
పటాన్ చెరు నియోజకవర్గ ప్రజలపై హామీల వర్షం కురిపించారు బండి సంజయ్. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని అన్నారు. మియాపూర్ నుండి సంగారెడ్డి వరకు మెట్రో రైలు వేయిస్తామని.. ప్రతి డివిజన్ లో 100 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేస్తామని తెలిపారు. అర్హులైన అందరికీ ఇండ్లు కట్టిస్తామని.. పటాన్ చెరువును ఎడ్యుకేషన్ హబ్ గా మారుస్తామని హామీ ఇచ్చారు.
అక్కడున్న కార్యకర్తలు బండి సంజయ్ ను సీఎం.. సీఎం.. అంటూ నినాదాలు చేయగా.. మీరు సీఎం అనడం వల్లే తన పదవి పోయిందని అన్నారు. దయచేసి తనని సీఎం అనొద్దంటూ కార్యకర్తలను కోరారు.