/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-2024-08-09T203824.357.jpg)
భారత్‌లో అంధుల కోసం మొదటిసారిగా ఇంటర్నేషనల్ యూనివర్శిటీ ఏర్పాటు కానుంది. జపాన్‌లోని సుకుబా యూనివర్శిటీతో ఒడిశా ప్రభుత్వం దీనిపై చర్చలు జరుపుతోంది. సోషల్ సెక్యూరిటీ అండ్ ఎంపవర్‌మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిసెబిలిటీస్ (SSEPD) విభాగం ప్రిన్సిపల్ సెక్రటరీ బిస్తుపాద సేథీ ఈ విషయాన్ని వివరించారు. ఒడిశాకు వచ్చిన సుకుబా యూనివర్శిటీ బృందంతో ఎస్‌ఎస్‌ఈడీపీ అధికారులు చర్చలు జరిపినట్లు పేర్కొన్నారు. అయితే భారత్‌లో 50 లక్షలకు పైగా అంధులు ఉన్నారు. ఇందులో ఒక్క ఒడిశాలోనే 5 లక్షల మంది ఉన్నారు. వీళ్లలో 2 లక్షల మంది యువతే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే వీళ్లందరికీ విద్య, సాంకేతిక నైపుణ్యం అందించి ఉద్యోగవకాశాలు ఇవ్వాలనే ఈ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని లక్ష్యం పెట్టుకున్నారు.
Also Read: జైలు నుంచి విడుదలైన మనీష్ సిసోడియా..
అయితే ఈ యూనివర్శిటీకి ప్రముఖ కవి, సంఘ సంస్కర్త భీమ భోయ్ పేరును పెట్టనున్నట్లు సేథీ పేర్కొన్నారు. అలాగే యూనివర్శిటీలో విద్యతో సహా పాలసీ రీసెర్చిలో ఒకేషనల్ కోర్సులు, ఆక్యూపంక్చర్ అలాగే ఫిజియో థెరపీలో సాంకేతిక కోర్సులు వంటివి ఉంటాయని తెలిపారు. అంతేకాదు వీటికి సంబంధించి ఆమోదం కోసం ప్రతిపాదనలను ముఖ్యమంత్రి మోహన్ చరణ మాఝీకి పంపుతామని పేర్కొన్నారు. అలాగే ఈ యూనివర్సిటీలో స్వదేశీ విద్యార్థులతో పాటు విదేశీ విద్యార్థులకు కూడా ప్రవేశాలు కల్పిస్తామని చెప్పారు.
Also Read: నదులు లేని 8 దేశాలు – తాగునీరు ఇలా!