గెలుపు పవన్‌ దే: పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ!

పిఠాపురం నియోజకవర్గంలో పవన్‌ తరుఫున ప్రచారం నిర్వహిస్తామని వివరించారు. చంద్రబాబు నాయుడుకి ఇచ్చిన మాట ప్రకారం పవన్ గెలిపించి తీరతామని వర్మ పేర్కొన్నారు,రాష్ట్రం అంతా ప్రచారం చేయవలసిన బాధ్యత మాపై ఉంది.చంద్రబాబు, పవన్ కళ్యాణ్ రాకపోయినా మా ప్రచారం ఆగదని వర్మ పేర్కొన్నారు

New Update
గెలుపు పవన్‌ దే: పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ!

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ పార్టీలో ప్రచారంలో స్పీడు పెంచాయి. ఈ క్రమంలోనే నాయకులు తమ నియోజకవర్గాల్లోని ప్రజలకు మరింత చెరువుగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే కూటమి తరుపున పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్న పవన్ అక్కడే ఓ కొత్త ఇంటిని కూడా నిర్మించి గృహా ప్రవేశం చేశారు.

ఈ క్రమంలోనే అక్కడి మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. నియోజకవర్గంలో పవన్‌ తరుఫున ప్రచారం నిర్వహిస్తామని వివరించారు. చంద్రబాబు నాయుడుకి ఇచ్చిన మాట ప్రకారం పవన్ గెలిపించి తీరతామని వర్మ పేర్కొన్నారు,రాష్ట్రం అంతా ప్రచారం చేయవలసిన బాధ్యత మాపై ఉంది.

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ రాకపోయినా మా ప్రచారం ఆగదని వర్మ పేర్కొన్నారు. నియోజకవర్గంలో వైఎస్సార్ పార్టీ నాయకులు ఏలేరు ఆధునీకరణ పనులు నిలిపివేసారు..అంతేకాకుండా ఎటువంటి అభివృద్ధి చేయలేదు. ఇప్పటివరకు కనిపించని వైసీసీ అభ్యర్థి వంగా గీత ఇప్పుడు ఓట్లు కోసం వచ్చారంటూ ఎద్దేవా చేశారు.

వైసీపీ నాయకులను మండలానికి ఒక్కరిని ముఖ్యనాయకులను పెట్టుకున్నా మా పార్టీలకు నేను ఒక్కడిని చాలు అన్నారు.అధికారులను డైవర్ట్ చేసి మరోక వాహనాల్లో వైసీపీ డబ్బు తరలిస్తూన్నారని పేర్కొన్నారు.ఎవరు ఎన్ని వ్యూహాలు పన్నినా పవన్ గెలుపుని ఆపలేరు అంటూ వర్మ పేర్కొన్నారు.

Also read: అవును మేమిద్దరం విడిపోతున్నాం.. స్టార్‌ హీరో అధికారిక ప్రకటన!

Advertisment
తాజా కథనాలు