నాగర్‌ కర్నూల్‌ ఫుడ్‌ పాయిజన్‌పై హైకోర్టులో పిటీషన్

నాగర్‌ కర్నూల్ జిల్లాలోని మన్ననూర్‌ వసతి గృహంలో గురువారం జరిగిన ఫుడ్ పాయిజన్‌పై హైకోర్టులో పిటీషన్ దాఖలైంది. పిల్లల ప్రాణాలకు రక్షణ లేకుండా పోతోందని న్యాయవాది చిక్కూడి ప్రభాకర్‌ హైకోర్టులో వేసిన పిటీషన్‌లో తెలిపారు.

New Update
నాగర్‌ కర్నూల్‌ ఫుడ్‌ పాయిజన్‌పై హైకోర్టులో పిటీషన్

నాగర్‌ కర్నూల్ జిల్లాలోని మన్ననూర్‌ వసతి గృహంలో గురువారం జరిగిన ఫుడ్ పాయిజన్‌పై హైకోర్టులో పిటీషన్ దాఖలైంది. పిల్లల ప్రాణాలకు రక్షణ లేకుండా పోతోందని న్యాయవాది చిక్కూడి ప్రభాకర్‌ హైకోర్టులో వేసిన పిటీషన్‌లో తెలిపారు. హాస్టల్‌లో ఉన్న సమారు 300 మంది విద్యార్థినులు కడుపునొప్పి, జ్వరం, వాంతులు, విరేచనాలతో ఇబ్బంది పడుతున్నారని పిటిషనర్‌ ఫిల్‌లో వెల్లడించారు. గురువారం రాత్రి సమారు 150 మంది బాలికలను అంబులెన్స్‌లో కాకుండా గొర్రెలు, బర్రెలను తరలించే వాహనాల్లో తీసుకెళ్లారన్నారు. ఇందులో సుమారు 15 మంది విద్యార్థినుల పరిస్ధితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారన్నారు. కాగా దీనిపై స్పందించిన హైకోర్టు ఫుడ్ పాయిజన్‌పై కేసు మంగళవారం విచారణకు వచ్చేలా చూడాలని రిజిస్టార్‌ను ఆదేశించింది.

అస్సలు ఏం జరిగిందంటే.?

నాగర్‌ కర్నూల్ జిల్లా అమ్రాబాద్‌ మండల పరిధిలోని మన్ననూరులోని గిరిజన సంక్షేమ శాఖ బాలికల వసతిగృహంలో ఫుడ్ పాయిజన్‌ వల్ల సుమారు 40 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన హాస్టల్‌ సిబ్బంది బాధితులను అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాల నేతలు విద్యార్థినుల హాస్టల్‌ ముందు బైఠాయించారు.

హాస్టల్‌ నిర్వహకులు విద్యార్థునులకు నాణ్యమైన భోజనం పెట్టడంలో విఫలమయ్యారని ఆరోపించారు. పైసలకు కక్కుర్తిపడి నాసిరకమైన భోజనం పెట్టడం వల్ల విద్యార్థినుల ప్రాణాలపైకి వచ్చిందన్నారు. హాస్టల్‌లోని బాలికల ఫుడ్‌ కోసం ప్రభుత్వం ఫండ్స్‌ రిలీజ్‌ చేసినా.. హాస్టల్ సిబ్బంది మాత్రం డబ్బులను పక్కదోవ పట్టిస్తూ కుళ్లిపోయిన టమాటాలు, గుడ్లతో పాటు ఇతర నాసిరక నిత్యావసర సరకులను తీసుకొచ్చి విద్యార్థులకు వడ్డిస్తున్నారన్నారు. దీంతో ఆ భోజనం తిన్న విద్యార్థునులు అస్వస్థతకు గరువుతున్నారని వెల్లడించారు.

మరోవైపు అస్వస్థతకు గురైన విద్యార్థునుల తల్లిదండ్రులకు హాస్టల్‌ సిబ్బంది సమాచారం ఇచ్చారు. దీంతో హుటా హుటీన అచ్చంపేటలోని ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకున్న యువతుల ఫెరెండ్స్‌ విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. వైద్యుల సూచన మేరకు కొందరు విద్యార్థినులను మహబూబ్ నగర్‌లోని ప్రైవేట్ ఆస్సత్రికి తరలించారు. బాధితుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు హాస్టల్‌ సిబ్బందిపై కేసు నమోదు చేసుకున్నారు. హాస్టల్‌ సిబ్బంది సరుకులను ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారనే దానిపై ఆరా తీస్తున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు