AP News: చంద్రబాబు దోస్తులంతా దొంగలే.. డ్రగ్స్ వ్యవహారంపై పేర్ని నాని సంచలన ఆరోపణలు! చంద్రబాబు దోస్తులంతా దొంగలే అంటూ సంచలన ఆరోపణలు చేశారు మాజీ మంత్రి పేర్ని నాని. అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. బ్రెజిల్ లోని శాంటోస్ పోర్టు నుంచి విశాఖకు డ్రగ్స్ చేరడంతో దేశం మొత్తం ఉలిక్కి పడిందన్నారు. By Bhoomi 22 Mar 2024 in ఆంధ్రప్రదేశ్ గుంటూరు New Update షేర్ చేయండి Perni Nani Over Vizag Drugs: విశాఖ సీపోర్టులో 25వేల కిలోల డ్రగ్స్ పట్టుబడడంపై మాజీ మంత్రి పేర్ని నాని స్పందించారు. అమరావతిలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. బ్రెజిల్లోని శాంటోస్ పోర్టు నుంచి విశాఖకు వచ్చిన ఓ కంటైనర్ లో ఆ డ్రగ్స్ ను సీబీఐ (CBI) గుర్తించిందన్నారు. ఆ డ్రగ్స్ కంటైనర్ విశాఖకు చేరడంతో దేశం మొత్తం ఉలిక్కి పడిందన్నారు.ఆ డ్రగ్స్ (Drugs) బయటకు రాకుండా సీబీఐ పట్టుకోవడం అదృష్టమన్నారు. ఆ డ్రగ్స్ లావాదేవీలు జరిపిన సంస్థలు.. వ్యక్తులెవరనే అంశంపై విచారణ జరుగుతోందని తెలిపారు. సీబీఐ నోరు విప్పక ముందే చంద్రబాబు (Chandrababu), టీడీపీ వైసీపీపై విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. విదేశాల నుంచి డ్రగ్స్ తెచ్చి అమ్ముతున్న వాళ్లంతా.. టీడీపీ బంధువులే అంటూ నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. వదినకు, మరిదికి చుట్టాలే.. బీరకాయ పీచు సంబంధాలే అన్నారు. ఈ డ్రగ్స్ రవాణా వెనుక చంద్రబాబు చుట్టాలు ఉంటూనే జగన్ మీద విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. బ్రాందీ పంచే స్థాయిని దాటి డ్రగ్స్ పంచే స్థాయికి చంద్రబాబు, లోకేష్ (Lokesh) దిగజారారా అనే అనుమానం కలుగుతోందని కీలక వ్యాఖ్యలు చేశారు.చంద్రబాబు సవాసాలన్నీ దొంగలతోనే..ఎద్దేవా చేశారు. రాజకీయాల కోసం ఎంతకైనా దిగజారిన వాడు కాబట్టి.. డ్రగ్స్ రవాణపై లోతైన విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఓటు కోసం చంద్రబాబు ఏమైనా చేస్తారు కాబట్టి.. విచారణ జరిపించాలని కోరినట్లు పేర్ని నాని తెలిపారు. ఎన్నికల నియామళిని ఉల్లంఘించి డ్రగ్స్ రవాణా విషయంలో చంద్రబాబు ట్వీట్ చేశారు.ఆధారాల్లేని ఆరోపణలు చేస్తే ఎన్నికల కోడ్ ఉల్లంఘించినట్టే అన్నారు. నిజం గెలవాలి పేరుతో చంద్రబాబు సతీమణి భువనేశ్వరి చెక్కులు పంపిణీ చేశారన్నారు పేర్నినాని. ఇది కూడా చదవండి: పెళ్లిలో చిచ్చు పెట్టిన మటన్ ముక్క..పొట్టు పొట్టు కొట్టుకున్న బంధువులు..! #cbi #chandrababu #ap-politics #ysrcp #perni-nani #visakhapatnam-port మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి