Money Scheme : రోజుకు రూ. 100 జమ చేయండి..మీరు రిటైర్మెంట్ అయ్యే వరకు రూ. 1కోటి మీ చేతిలో ఉంటుంది...!! రోజుకు 100 రూపాయలు పెట్టుబడి పెడితే..నెలకు 3వేలు జమ అవుతుంది. 30ఏళ్లలో కోటి రూపాయలు.3వేలతో SIPను ప్రారంభిస్తే..30ఏళ్ల మొత్తం రూ. 10.80లక్షల పెట్టుబడికి దీర్ఘకాలిక రాబడి 12శాతం. అంటే రిటైర్ మెంట్ నాటికి రూ.1,05,89,741కి పెరుగుతుంది. By Bhoomi 16 Dec 2023 in బిజినెస్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Retirement Plan : మనలోచాలా మంది రోజు మూడు సిగరెట్లు తాగుతున్నారనుకుందాం. మూడు సిగరెట్లకు ఖర్చు రూ. 60 రూపాయలు అనుకుందాం. సిగరెట్ తోపాటు మూడు నుంచి 4 కప్పుల టీ తాగితే..రూ. 40ఖర్చు చేయాల్సి వస్తుంది. ఈ రెండు కలిపితే టీ, సిగరెట్లకు రోజువారీ ఖర్చు రూ. 100 అవుతుంది. దీన్ని బట్టి ఒక నెలలో పెట్టుబడి పెట్టాల్సిన మొత్తం దాదాపు రూ. 3వేలు అవుతుంది. కేవలం టీ, సిగరెట్ల కోసం రోజువారీ డబ్బును పెట్టుబడిగా పెడితే..పనికాలంలో అంటే దాదాపు 30ఏళ్లలో కోటి రూపాయలకు పైగా నిధులు సమకూరుతాయి. ఎవరైనా సరే 30ఏళ్ల వయస్సులో ఉద్యోగం ప్రారంభించిన తర్వాత నెలకు రూ. 3వేలతో SIPను ప్రారంభిస్తే...30ఏళ్లలో మొత్తం రూ. 10.80లక్షల పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. ఈక్విటి మ్యూచువల్ ఫండ్స్ సగటు దీర్ఘకాలిక రాబడి 12శాతం. ఈ రాబడిని బట్టి చూస్తే రిటైర్మెంట్(Retirement Plan) నాటికి ఈ పెట్టుబడి రూ. 1,05,89,741కి పెరుగుతుంది. ఈ కాలంలో రూ. 95,09,741వడ్డీగా అందుతుంది. మ్యూచువల్ ఫండి సిప్ పై 12శాతం రాబడి అనేది అందరికీ తెలిసిందే. 20ఏళ్ల సుదీర్ఘ కాలంలో 12శాతం కంటే ఎక్కువ రాబడిని ఇవ్వగల కెపాసిటి కలిగిన ఎన్నో స్కీంలు మార్కెట్లో ఉన్నాయి. Policybazaar.com తెలిపిన వివరాల ప్రకారం ఇలాంటి ఫండ్స్ చాలా ఉన్నాయి. వీటి సగటు రాబడి 20ఏళ్లలో 12శాతం కంటే ఎక్కువ. ఏ పాలసీలు ఎంత శాతం వడ్డీ చెల్లిస్తున్నాయో చూద్దాం. - ఆదిత్య బిర్లా(Aditya Birla) వెల్త్ ఆస్పైర్ ఫండ్ 10ఏళ్లకు పైగా పెట్టుబడిపై 19.20% రాబడి ఇస్తుంది. -బజాజ్ అలయన్జ్ స్మార్ట్ వెల్త్ గోల్ కూడా 10 ఏళ్ల పైగా పెట్టుబడిపై 17.90% వార్షిక రాబడి. -హెచ్‌డిఎఫ్‌సి లైఫ్(HDFC Life) సంపూర్ణ నివేష్‌లో డబ్బు పెట్టుబడి పెట్టిన వారికి దీర్ఘకాలంలో ప్రతి ఏడాది 17.70% రాబడి వస్తుంది. -మ్యాక్స్ లైఫ్ ఆన్‌లైన్ సేవింగ్స్ 10ఏళ్లకు పైగా పెట్టుబడిపై 16.90% రాబడి అందించింది. -భారతి AXA లైఫ్ వెల్త్ ప్రో ఫండ్ కూడా 10ఏళ్ల కంటే ఎక్కువ కాలంలో సగటు రాబడిని 16.60శాతం వరకు ఇచ్చింది. కాగా దేశంలోని ప్రముఖ అసెట్ మేనేజ్ మెంట్ కంపెనీ సీఈవో రాధికా గుప్తా తాజాగా పెట్టుబడుల పట్ల ప్రజలు ఎంత అలసత్వంగా ఉన్నారో తెలిపారు. మన దేశంలో దాదాపు 20కోట్ల మంది వినియోగదారులు కొన్ని రకాల ఓటీటీ(OTT) లకు మాత్రమే సబ్ స్క్రిప్షన్ కలిగి ఉన్నారని..వాటికోసం ప్రతినెలా 150 నుంచి 200 రూపాయలు ఖర్చు చేస్తున్నారని కానీ..మ్యూచువల్ ఫండ్స్(Mutual Funds) లో వందరూపాయల పెట్టుబడి పెట్టే వారి సంఖ్య 10శాతం అంటే 2కోట్లు మాత్రమే ఉందని ఆమె చెప్పారు. ఇది కూడా చదవండి: గ్యాస్ సిలిండర్ ధరపై రేవంత్ సర్కార్ కీలక అప్ డేట్…సిద్ధంగా ఉండండి..!! #mutual-funds #sip #investment-plans #retirement-plan #money-scheme మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి