ర్యాపిడోలో ఫ్రీగా పోలింగ్ కేంద్రాలకు.. తెలంగాణలో ఓటు వేయడానికి జజాలు బారులు తీరుతున్నారు. దూరమైనా సరే వెళ్ళి ఓటేస్తున్నారు. ఈ క్రమంలో జనాలు ఉచిత ర్యాపిడో సేవలను సైతం వినియోగించుకుంటున్నారు. హైదరాబాద్ లో 26 కేంద్రాలకుర్యాపిడో ఈరోజంతా ఉచిత రైడ్ లను ఇస్తున్నామని ప్రకటించింది. By Manogna alamuru 30 Nov 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి తెలంగాణలో పోలింగ్ జరుగుతోంది. పోలింగ్ వందశాతం జరగడానికి ఈసీ అన్ని ఏర్పాట్లు చేసింది. దాంతో పాటూ ప్రవైటు సంస్థలు కూడా ఓటింగ్ బాగా జరిగేందుకు సహకరిస్తామని ముందుకు వచ్చాయి. ఈ క్రమంలో ఈరోజు పోలింగ్ కు ఓటర్లను తరలించేందుకు ఉచిత రవాణా సదుపాయాన్ని కల్పించనున్నట్లు రాపిడో సంస్థ ప్రకటించింది. నగరంలోని 26 పోలింగ్‌స్టేషన్‌లకు రాపిడో సేవలు లభిస్తున్నాయి. దీని కోసం ఓటర్లు తమ మొబైల్ ఫోన్ రాపిడో యాప్‌లో ‘ఓట్ నౌ’ కోడ్‌ను నమోదు చేసుకోవాలి. అలా చేసుకున్న వాళ్ళు ఫ్రీగా ర్యాపిడో బుక్ చేసుకోవచ్చును. ఎంత దూరం అయినా హాయిగా వెళ్ళి ఓటు వేసి రావచ్చును. దీనికి ఓటర్లు కూడా బాగానే స్పందిస్తున్నారు. తమ ఓటును వేయడానికి ర్యాపిడో వెహికల్స్ ను బుక్ చేసుకుంటున్నారు. Also read:తెలంగాణలో ఇప్పటివరకూ ఎంత పోలింగ్ శాతం నమోదయ్యిందంటే? హైదరాబాద్ లో మొత్తం 2,600 పోలింగ్ కేంద్రాలకు ఓటర్లను ఉచితంగా చేరవేస్తామని రాపిడో కంపెనీ తెలిపింది. పోలింగ్ కేంద్రాలు, ప్రయాణ ఖర్చుల కారణంగా కొంత మంది తమ ఓటు హక్కును వినియోగించుకోకపోవచ్చనే ఉద్దేశంతో ఈ ప్రతిపాదనను ప్రకటించినట్లు రాపిడో చెబుతోంది. నగరంలో ఎక్కడి నుంచైనా తమ పోలింగ్ బూత్ కు ఉచితంగా వెళ్లేందుకు తమ సంస్థ సహాయం చేస్తుందన్నారు. ఈ ఉచితం ఆఫర్ ముఖ్యంగా యువ ఓటర్లను పోలింగ్ స్టేషన్‌లకు తరలించడంలో ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నారు. ప్రజాస్వామ్యం భారతదేశానికి ఆభరణమని.. ఆ ప్రజాస్వామ్యం ఇచ్చిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకునేలా తనవంతు సహకారం అందిస్తానని చెప్పారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ర్యాపిడో వ్యవస్థాపకుడు చెబుతున్నారు. #telangana-elections-2023 #polling #rapido #votes #services మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి