Lok Sabha Elections : లోక్‌సభ ఎన్నికల వేళ.. డీవై చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు..

లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి సుప్రీంకోర్టు చీఫ్ జస్టీస్‌ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో ఓటు వేసే అవకాశాన్ని కోల్పోవద్దని.. రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామ్యంలో ఇది కీలకమైన కర్తవ్యమని పేర్కొన్నారు. ప్రతి ఐదేళ్లకు ఐదు నిమిషాలు కేటాయించి గర్వంగా ఓటు వేయాలన్నారు.

New Update
Lok Sabha Elections : లోక్‌సభ ఎన్నికల వేళ.. డీవై చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు..

DY Chandrachud : లోక్‌సభ ఎన్నికలు(Lok Sabha Elections) మొదలయ్యాయి. మొదటి దశ పోలింగ్ 21 రాష్ట్రాల్లో 102 నియోజకవర్గాల్లో జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు(Supreme Court) చీఫ్ జస్టీస్‌ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో ఓటు వేసే అవకాశాన్ని కోల్పోవద్దని.. రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామ్యంలో ఇది కీలకమైన కర్తవ్యమని పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్(Election Commission) మై ఓట్ మై వాయిస్‌ మిషన్‌కు ఆయన వీడియో సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ' ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్. రాజ్యాంగం దేశ ప్రజలకు అనేక హక్కులు కల్పించింది. ప్రతిఒక్కరూ తనకు అప్పగించిన కర్తవ్యాన్ని పూర్తి నిర్వర్తించాలి. పౌరులు బాధ్యాతాయుతంగా ఓటు వేసే అవకాశాన్ని కోల్పోవద్దు. ప్రతి ఐదేళ్లకు ఐదు నిమిషాలు కేటాయించవచ్చు. గర్వంగా ఓటు వేయండి. ప్రభుత్వాన్ని ఎన్నుకోవడంలో పౌరలకు పాత్ర ఉంది. అందుకే రాజ్యాంగంలో భారత ప్రభుత్వం ప్రజలచే, ప్రజల కొరకు రాసకుందని' చంద్రచూడ్ అన్నారు.

Also read:  ఏపీపై బీజేపీకి ఎందుకంత గురి..డిజిటల్ ప్రచారంలో కమలనాథుల వ్యూహం ఏంటి?

తొలిసారిగా తాను ఓటు వేసుకున్న సందర్భాన్ని కూడా ఆయన గుర్తు చేసుకున్నారు. పోలింగ్ బూత్ వద్ద క్యూలో నిలబడి ఉన్నప్పడు ఎంతో ఉత్సాహంగా అనిపించిందని పేర్కొన్నారు. లాయర్‌గా పనిచేస్తున్నప్పుడు ఓటు వేయడంలో విఫలం కాలేదని తెలిపారు. ఇదిలాఉండగా.. ఏప్రిల్ 19న మొదలైన లోక్‌సభ ఎన్నికలు జూన్ 1 వరకు జరగనున్నాయి. జూన్ 4న కౌంటింగ్ నిర్వహించనున్నారు. మరీ ఈసారి దేశ ప్రజలు కేంద్రంలో ఎవరికి అధికారం అప్పగిస్తారో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

Also Read: బీజేపీ అధికారంలోకి వస్తే.. మళ్లీ అది పునరుద్దరిస్తాం: నిర్మలా సీతారామన్

Advertisment
తాజా కథనాలు